మంత్రిమండలి
భారతదేశాని కిమరియు ఆస్ట్రేలియా కు మధ్య సాధికార ఆర్థిక సంస్థ ల పరస్పర గుర్తింపు ప్రణాళిక కు ఆమోదంతెలిపిన మంత్రిమండలి
Posted On:
16 AUG 2023 4:30PM by PIB Hyderabad
భారతదేశం ప్రభుత్వం లో పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ సంబంధి కేంద్రీయ మండలి (సిబిఐసి)కి, రెవెన్యూ విభాగానికి మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం లో ఆస్ట్రేలియా బార్డర్ ఫోర్స్ ఒక భాగం గా ఉన్నటువంటి డిపార్ట్ మెంట్ హోం ఎఫైర్స్ కు మధ్య పరస్పర గుర్తింపు ప్రణాళిక (మ్యూచువల్ రికగ్నిశన్ అరేంజ్ మెంట్ ..ఎమ్ఆర్ఎ) పై సంతకాల కు మరియు అనుమోదం ప్రక్రియ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన మంత్రిమండలి సమావేశం ఆమోదాన్ని తెలియ జేసింది.
దిగుమతిదారు దేశాని కి సంబంధించిన కస్టమ్స్ అధికార వర్గాల ద్వారా వస్తువుల క్లియరెన్స్ కు సంతకందారుడు గా ఉన్న గుర్తింపు కలిగిన మరియు విశ్వసనీయమైన ఎగుమతిదారు సంస్థల కు పరస్పరం ప్రయోజనాల ను అందించాలనేది ఈ అరేంజ్ మెంట్ యొక్క లక్ష్యం గా ఉంది. వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేశన్ అమలు పరుస్తున్న సేఫ్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ స్టాండర్డ్ స్ తాలూకు ఒక కీలకమైన అంశమే ఈ మ్యూచువల్ రికగ్నిశన్ ఆఫ్ ఆథరైజ్ డ్ ఇకానామిక్ ఆపరేటర్స్. ప్రపంచ స్థాయి లో వ్యాపారాని కి ఉన్నత స్థాయి లో వెసులుబాటు ను అందిస్తూనే, సప్లయ్ చైన్ ల సంబంధి భద్రత ను ఆది నుండి అంతం వరకు పటిష్టపరచడం ద్వారా ప్రపంచ వ్యాపారాని కి భద్రత ను సమకూర్చాలి అనేదే దీని ధ్యేయంగా ఉంది. ఈ అరేంజ్ మెంట్ ఆస్ట్రేలియా లో మన ఎగుమతిదారుసంస్థల కు చాలా లాభం చేకూరుతుంది. అంతేకాక దీని తో ఉభయ దేశాల మధ్య వ్యాపార సంబంధాలకు ప్రోత్సాహం అందుతుంది.
మ్యూచువల్ రికగ్నిశన్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ ట్రస్టెడ్ ట్రేడర్ ప్రోగ్రామ్ మరియు భారతదేశం లో ఆథరైజ్ డ్ ఇకానామిక్ ఆపరేటర్ ప్రోగ్రామ్ లు రెండు దేశాల కు చెందిన సాధికార ప్రతినిధులు సంతకాలు చేసే తేదీ నుండి అమలు లోకి వస్తాయి. ఇరు దేశాల యొక్క కస్టమ్స్ యంత్రాంగాల సమ్మతి తో ప్రతిపాదిత మ్యూచువల్ రికగ్నిశన్ అరేంజ్ మెంట్ సంబంధి పాఠాని కి తుది రూపు ను ఇవ్వడం జరిగింది.
***
(Release ID: 1949601)
Visitor Counter : 158
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam