ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

77వ స్వాతంత్ర్య దినం నాడు ప్రపంచ నేత లు వారి శుభాకాంక్షల నుతెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు పలికిన ప్రధాన మంత్రి

Posted On: 15 AUG 2023 4:21PM by PIB Hyderabad

77వ స్వాతంత్ర్య దినం నాడు ప్రపంచ నేత లు వారి శుభాకాంక్షల ను తెలియజేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారికి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

 

మాల్దీవ్స్ గణతంత్రం అధ్యక్షుడు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్ గారు, స్వాతంత్ర్య దిన శుభాకాంక్షల ను తెలియజేసినందుకు గాను మీకు ఇవే ధన్యవాదాలు.’’ అని పేర్కొన్నారు.

భూటాన్ ప్రధాని యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబిస్తూ,

‘‘మా స్వాతంత్ర్య దినం సందర్బం లో మీరు వ్యక్తం చేసిన ఆకాంక్షల కు ఇవే కృత‌జ్ఞ‌త‌లు, భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే శెరింగ్ గారు.’’ అని పేర్కొన్నారు.

 

నేపాల్ ప్రధాని కార్యాలయం చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,

‘‘ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ గారు, మీ యొక్క స్నేహపూర్ణమైన శుభ ఆకాంక్షలకు గాను మ కు ఇవే ధన్యవాదాలు.’’ అని పేర్కొన్నారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘మీ ప్రేమాస్పదమైనటువంటి ఆకాంక్షల కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రెసిడెంట్ ఇమేన్యుయల్ మేక్రోన్ గారు. నేను పేరిస్ ను సందర్శించడాన్ని ఆప్యాయం గా గుర్తుకు తెచ్చుకొంటున్నాను; మరి భారతదేశం - ఫ్రాన్స్ సంబంధాల కు ఊతాన్ని ఇచ్చే దిశ లో మీరు కనబరచినటువంటి ఉద్వేగాన్ని నేను ప్రశంసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

మారిశస్ ప్రధాని చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ.

‘‘మారిశస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ గారు, మీ హృద‌యపూర్వకమైన శుభాకాంక్షల కు గాను ఇవే ధన్యవాదాలు.’’ అని పేర్కొన్నారు.

***


(Release ID: 1949068) Visitor Counter : 188