హోం మంత్రిత్వ శాఖ

2023 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 954 మందికి పోలీసు పతకాలు ప్రదానం


ఒకరికి గ్యాలంట్రీ (PPMG), 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PMG), 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (PPM) 642 మందికి పోలీస్ పతకాలు ( మెరిటోరియస్ సర్వీస్ (PM)) ప్రదానం

Posted On: 14 AUG 2023 10:29AM by PIB Hyderabad

2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మొత్తం 954 మంది పోలీసు సిబ్బంది పోలీసు పతకాలకు  అయ్యారు.  ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (PPMG) సిఆర్పిఎఫ్  ఒక వ్యక్తికీ,  పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PMG) 229 మందికి లభించింది. 82 మంది పోలీసులు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 642 మందికి పోలీస్ పతకాలు ( మెరిటోరియస్ సర్వీస్ (PM)) లభించాయి.   

 

విధి నిర్వహణలో సాహసోపేతం ప్రదర్శించిన సిబ్బందికి ప్రదానం చేస్తున్న   230 గ్యాలంట్రీ అవార్డుల్లో  ఎక్కువ భాగం తీవ్రవాద  ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న   125 మంది సిబ్బందిజమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందిన 71 మంది సిబ్బంది, ఈశాన్య ప్రాంతానికి చెందిన 11 మంది సిబ్బంది కి లభించాయి.  గ్యాలంట్రీ అవార్డుకు ఎంపిక అయిన వారిలో సిఆర్పిఎఫ్ కు చెందిన  28 మంది, మహారాష్ట్రకు  చెందిన, 33 మంది.  55 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఛత్తీస్‌గఢ్ కు చెందిన  24 మందితెలంగాణకు చెందిన 22 మంది, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన  18 మంది సిబ్బంది ఉన్నారు.  మిగిలినవారు  ఇతర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, సీఏపిఎఫ్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. 

 

 ప్రాణాలు, ఆస్తి రక్షణ లేదా నేరాలను నిరోధించడంలో లేదా నేరస్థులను అరెస్ట్ చేయడంలో కనబరిచే ప్రతిభకు గుర్తింపుగా   ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PPMG),పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (PMG) ప్రదానం చేస్తారు.   పోలీస్ సర్వీస్‌లో ప్రత్యేక విశిష్ట కనబరిచిన సిబ్బందికి   రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవ పతకం (PPM), ప్రతిభ కనబరిచిన సిబ్బందికి  పోలీసు పతకం (PM) ప్రదానం చేస్తారు. 

 

అవార్డు గ్రహీతల జాబితాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి 

Sl No.

విషయం

సిబ్బంది  సంఖ్య

జాబితా

1

గ్యాలంట్రీ కోసం రాష్ట్రపతి పోలీసు పతకాలు (PPMG)

01

జాబితా-I

2

గ్యాలంట్రీ కోసం పోలీసు పతకాలు (PMG)

229

జాబితా -II

3

విశిష్ట సేవ కోసం రాష్ట్రపతి పోలీసు పతకాలు

82

జాబితా -III

4

మెరిటోరియస్ సర్వీస్ కోసం పోలీస్ మెడల్

642

జాబితా -IV

5

పోలీసు సిబ్బందికి రాష్ట్ర వారీగా/ ఫోర్స్ వారీగా పతకాలు గ్రహీతల జాబితా

జాబితా ప్రకారం

జాబితా-V


 

జాబితా-వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జాబితా -II వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జాబితా -III వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జాబితా -IV వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

జాబితా-Vని వీక్షించడానికి ఇక్కడ క్లిక్ చేయండి

వివరాలు www.mha.gov.in ,  https:// awards.gov.in లో అందుబాటులో ఉన్నాయి  . 

 

***



(Release ID: 1948480) Visitor Counter : 155