ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చైనా లో జరిగినముప్ఫై ఒకటో వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో భారతదేశం యొక్క క్రీడాకారుల ఆట తీరు నుప్రశంసించిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 08 AUG 2023 8:37PM by PIB Hyderabad

ముప్ఫై ఒకటో వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో రికార్డుల ను బ్రద్దలుకొట్టిన భారతదేశం క్రీడాకారులు మరియు క్రీడాకారిణుల యొక్క ఆట తీరు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ గేమ్స్ లో భారతదేశం క్రీడాకారులు 11 బంగారు పతకాలు, 5 వెండి పతకాలు మరియు పది కంచు పతకాల తో సహా 26 పతకాల ను గెలుచుకొన్నారు. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 1959 వ సంవత్సరం లో మొదలైనప్పటి నుండి చూస్తే ఇది భారతదేశం యొక్క సర్వశ్రేష్ఠమైన ప్రదర్శన అని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ఈ సాఫల్యాని కి గాను క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు , వారి కుటుంబాల కు మరియు క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు శిక్షణ ను ఇచ్చిన వారి కి అభినందనల ను తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ ఆటల లో క్రీడాకారులు మరియు క్రీడాకారిణుల ఆట తీరు భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడేటట్లు చేస్తుంది.

ముప్ఫై ఒకటో వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో, భారతదేశాని కి చెందిన క్రీడాకారులు, క్రీడాకారిణులు 26 పతకాల ను చేజిక్కించుకోవడం ద్వారా రికార్డుల ను బ్రద్దలు కొట్టి మాతృదేశాని కి తిరిగి వస్తున్నారు. ఇది ఇప్పటివరకు చూస్తే మన అత్యుత్తమమైనటువంటి ప్రదర్శన గా ఉంది. ఈ ఆటల లో 11 బంగారు పతకాలు, 5 వెండి పతకాల తో పాటు పది కంచు పతకాలు గెలవడమైంది.

నమ్మశక్యం కాని తీరు లో ప్రతిభ ను కనబరచి దేశ ప్రజల గౌరవాన్ని పెంచిన మరియు వృద్ధి లోకి వస్తున్న ఆటగాళ్లకు ప్రేరణ ను ఇచ్చిన మన క్రీడాకారుల కు వందనం.’’

విశేషించి సంతోషదాయకం అయినటువంటి విషయం ఏమిటి అంటే అది భారతదేశం 1959 వ సంవత్సరం లో ఈ ఆటలు ఆరంభం అయిన తరువాత నుండి ఇప్పటి వరకు వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో మొత్తం 18 పతకాల ను గెలిచింది. దీనిని పట్టి చూసినప్పుడు, ఈ సంవత్సరం లో 26 పతకాల మార్గదర్శక ఫలితం వాస్తవం లో ప్రశంసాయోగ్యమైనటువంటిది గా ఉంది.

ఈ ఉత్కృష్టమైన ప్రదర్శన మన క్రీడాకారులు, మన క్రీడాకారిణుల అచంచలమైన సమర్పణ భావాని కి ఒక రుజువు గా ఉంది. ఈ సాఫల్యాని కి గాను క్రీడాకారుల కు, క్రీడాకారిణు లకు, వారి యొక్క కుటుంబాల కు, క్రీడాకారులకు మరియు క్రీడాకారిణుల కు శిక్షణ ను ఇచ్చిన వారిని నేను అభినందిస్తున్నాను; మరి వారి భావి ప్రయాసల లో సైతం వారు రాణించాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

*****

DS/TS


(रिलीज़ आईडी: 1946972) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam