ప్రధాన మంత్రి కార్యాలయం

ఒక చరిత్రాత్మకకార్యక్రమం లో భాగం గా, దేశ వ్యాప్తం గా 508 రైల్ వే స్టేశన్ ల పునరభివృద్ధి కి గానుఆగస్టు 6 న శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి


ఆయా స్టేశన్ లను అమృత్ భారత్ స్టేశన్ స్కీము లో భాగం గా24,470 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో పునరభివృద్ధి పరచడం జరుగుతుంది

నగరం రెండు ప్రక్కలా సరైన ఏకీకరణ పై శ్రద్ధ తీసుకొంటూ స్టేశన్లను ‘సిటీ సెంటర్ లు’ గా అభివృద్ధి చేయడం కోసం విపుల ప్రణాళికల ను రూపొందించడంజరుగుతోంది

రైల్ వే స్టేశన్ చుట్టూ నగరం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలిఅనేటటువంటి సమగ్ర  దృష్టికోణం తో ఏకీకృత‌విధానాన్ని అనుసరించడం జరుగుతుంది

స్టేశన్ భవనం యొక్క రూపురేఖ లను స్థానిక సంస్కృతి నుండి,వారసత్వం నుండి మరియు వాస్తుకళ నుండి ప్రేరణ ను పొంది తీర్చిదిద్దడం జరుగుతుంది

Posted On: 04 AUG 2023 2:21PM by PIB Hyderabad

ఒక చరిత్రాత్మక కార్యక్రమం లో భాగం గా, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆగస్టు 6వ తేదీ నాడు ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా దేశ వ్యాప్తం గా 508 రైల్ వే స్టేశన్ ల పునరభివృద్ధి కై శంకుస్థాపన ను చేయనున్నారు.

 

అత్యాధునికమైందిగా ఉండేటటువంటి సార్వజనిక రవాణా కు ప్రాధాన్యాన్ని ఇవ్వడాన్ని గురించి ప్రధాన మత్రి తరచు గా నొక్కిచెప్తూ వస్తున్నారు. దేశం లో నలుమూలల ప్రజలు ప్రయాణించాలనుకొంటే రైలు మార్గాల వైపే మొగ్గు చూపుతూ ఉంటారని గమనించి, ఆయన రైల్ వే స్టేశన్ లలో ప్రపంచ శ్రేణి సౌకర్యాల ను అందించడానికి పెద్ద పీట ను వేయాలని స్పష్టం చేస్తుంటారు. ఈ యొక్క దృష్టికోణం నుండి స్ఫూర్తి ని పొంది, దేశం అంతటా 1309 స్టేశన్ లకు క్రొత్త మెరుగుల ను దిద్దడం కోసం అమృత్ భారత్ స్టేశన్ స్కీము ను ప్రవేశపెట్టడం జరిగింది.

 

ఈ పథకం లో భాగం గా, ప్రధాన మంత్రి 508 స్టేశన్ ల పునరభివృద్ధి కి శంకుస్థాపన ను చేయనున్నారు. ఈ స్టేశన్ లకు 24,470 కోట్ల రూపాయల కు పైచిలుకు ఖర్చు తో క్రొత్త మెరుగుల ను దిద్దడం జరుగుతుంది. నగరానికి ఇరు ప్రక్కలా సరైన ఏకీకరణ కు తావును ఇస్తూ, ఈ స్టేశన్ లను ‘సిటీ సెంటర్ లు’ గా అభి వృద్ధి పరచడానికి విపుల ప్రణాళికల ను సిద్ధం చేయడం అవుతోంది. రైల్ వే స్టేశన్ కు చుట్టూరా నగరం సంపూర్ణమైన రీతి లో అభి వృద్ధి చెందాలన్న సమగ్ర దృష్టికోణం తో ఈ ఏకీకరణ చోటు చేసుకోనుంది.

 

ఈ 508 స్టేశన్ లు 27 రాష్ట్రాల లోను మరియు కేంద్ర పాలిత ప్రాంతాల లోను విస్తరించి ఉన్నాయి. వీటి లో ఉత్తర్ ప్రదేశ్ లో మరియు రాజస్థాన్ లో చెరి 55 రైల్ వే స్టేశన్ లు, బిహార్ లో 49, మహారాష్ట్ర లో 44, పశ్చిమ బంగాల్ లో 37, మధ్య ప్రదేశ్ లో 34, అసమ్ లో 32, ఒడిశా లో 25, పంజాబ్ లో 22, గుజరాత్ లోను మరియు తెలంగాణ లోను చెరి 21 స్టేశన్ లు, ఝార్ ఖండ్ లో 20 స్టేశన్ లు, ఆంధ్ర ప్రదేశ్ లోను మరియు తమిళ నాడు లో చెరి 18 స్టేశన్ లు, హరియాణా లో 15 స్టేశన్ లు, కర్నాటక లో 13 స్టేశన్ లు సహా ఇతర స్టేశన్ లు భాగం గా ఉన్నాయి.

 

ఈ పునరభి వృద్ధి ప్రక్రియ రాక పోక ల కు చక్కనైన వ్యవస్థ కు, ఇంటర్ మోడల్ ఇంటిగ్రేశన్ కు పూచీ పడడం మరియు ప్రయాణికుల కు మార్గదర్శకం గా ఉండగల సుందరమైన సైన్ బోర్డులు సహా ఆధునిక సదుపాయాల ను అందుబాటు లోకి తీసుకు రానుంది. ఈ స్టేశన్ భవనాల రూపురేఖల ను స్థానిక సం స్కృతి, వార‌స‌త్వం మరియు వాస్తు రీతుల స్ఫూర్తి తో దిద్దితీర్చడం జరుగుతుంది.

 

***

 



(Release ID: 1945797) Visitor Counter : 251