సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

దేశం కోసం ప్రాణాలు అర్పించిన ‘వీరులకు‘ నివాళులు అర్పించేందుకు ‘మేరీ మాటీ మేరా దేశ్ ‘ ప్రచారం


దేశవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జన్ భాగీదారీ కార్యక్రమాలు

గ్రామ పంచాయతీలలో అమర వీరులకు శిలాఫలకాల (స్మారక ఫలకం) ఏర్పాటు

ఢిల్లీ లో అమృత్ వాటిక ఏర్పాటు కోసం అమృత్ కలశ యాత్ర ద్వారా దేశంలోని వివిధ మూలల నుంచి మట్టి సేకరణ

Posted On: 03 AUG 2023 7:50PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో 'మేరీ మాటీ మేరా దేశ్ ' ప్రచార కార్యక్రమాన్ని

ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట , సాహస స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించడం ఈ క్యాంపెయిన్ ఉద్దేశం. వీర జవాన్ లను  స్మరించుకునేందుకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ఈ క్యాంపెయిన్ లో పొందుపర్చనున్నారు. అమృత్ సరోవర్ లకు సమీపంలో ఉన్న గ్రామ పంచాయతీలలో వారిని స్మరించుకునే శిలాఫలకాలను ఏర్పాటు చేయనున్నారు.

సమాచార, ప్రసార శాఖ,  టెలికమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్  సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్ , యువజన వ్యవహారాల కార్యదర్శి శ్రీమతి మీతా రాజీవ్ లోచన్ ఈ రోజు న్యూఢిల్లీలో సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ వివరాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ప్రసార భారతి సి ఇ ఒ గౌరవ్ ద్వివేది కూడా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో శ్రీ అపూర్వ చంద్ర మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంగా 'మేరీ మాటీ మేరా దేశ్‘ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

 

గత ఏడాది నిర్వహించిన దేశవ్యాప్త ప్రచారం హర్ ఘర్ తిరంగా విజయవంతమైందని, ఈ ఏడాది మరింత ప్రతిష్టాత్మక కార్యక్రమం 'మేరీ మాటీ మేరా దేశ్'ను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అమరులైన స్వాతంత్య్ర సమరయోధులు, భద్రతా దళాలకు అంకితం చేస్తూ శిలాఫలకాల ఏర్పాటు, పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ, మిట్టి కా నమాన్, వీరుల త్యాగాలకు జోహార్లు అర్పిస్తూ వీరోన్ కా వందన్ వంటి కార్యక్రమాలు ఈ ప్రచారంలో ఉంటాయని శ్రీ అపూర్వ చంద్ర

తెలిపారు. ఈ ఏడాది కూడా హర్ ఘర్ తిరంగాను కూడా నిర్వహిస్తామని, అయితే మేరీ మాటీ - మేరా దేశ్ ప్రచారంలో ఒక ముఖ్యమైన అంశంగా దీనిని నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

ఈ ప్రచార కార్యక్రమం పై అవగాహన కల్పించడంలోనూ, దేశంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడంలోనూ మీడియా పాత్రను కార్యదర్శి వివరించారు.

 

సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్  మాట్లాడుతూ, అమరులైన స్వాతంత్య్ర సమరయోధులు, భద్రతా దళాలకు అంకితం చేస్తూ శిలాఫలకాల ఏర్పాటు, పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ, వసుధ వందన్, వీరుల త్యాగాలకు జోహార్లు అర్పిస్తూ వీరోన్ కా వందన్ వంటి కార్యక్రమాలు ఈ ప్రచారంలో ఈ ప్రచారంలో ఉంటాయని తెలియజేశారు.

గ్రామ, పంచాయితీ, బ్లాక్, పట్టణం, నగరం, మునిసిపాలిటీ మొదలైన ప్రాంతాలకు చెందిన స్థానిక అమర వీరుల త్యాగ స్ఫూర్తికి సెల్యూట్ చేసే శిలాఫలకం లేదా స్మారక ఫలకాన్ని  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫలకాలపై ఆయా ప్రాంతాలకు చెందిన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి పేర్లతో ప్రధాని సందేశం ఉంటుంది.

2021 మార్చి 12న ప్రారంభమైన 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కు ఇది ముగింపు కార్యక్రమం  అని, భారతదేశం అంతటా విస్తృతమైన ప్రజల భాగస్వామ్యం (జన్ భాగీదారీ) తో రెండు లక్షలకు పైగా కార్యక్రమాలు జరిగాయని శ్రీ గోవింద్ మోహన్ అన్నారు. 2023 ఆగస్టు 9 నుంచి 30 వరకు జరిగే 'మేరీ మాటీ  మేరా దేశ్' క్యాంపెయిన్ లో స్థానిక,  పట్టణ సంస్థల ద్వారా గ్రామ, బ్లాక్ స్థాయిల్లో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కార్యక్రమాలు ఉంటాయి.

 

ఢిల్లీలో 'అమృత్ వాటిక' ఏర్పాటు కోసం 7500 కలశాలలో దేశం నలుమూలల నుంచి మట్టిని తీసుకువచ్చేందుకు  'అమృత్ కలశ యాత్ర' జరుగుతుందని, ఈ 'అమృత్ వాటిక' 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పట్ల నిబద్ధతకు ప్రతీకగా ఉంటుందని ఆయన చెప్పారు. .

ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు (జన్ భాగీదారీ) https://merimaatimeradesh.gov.in అనే వెబ్ సైట్ ను ప్రారంభించినట్టు సాంస్కృతిక శాఖ కార్యదర్శి తెలిపారు. ఇక్కడ ప్రజలు మట్టి లేదా మట్టి దీపాన్ని పట్టుకుని సెల్ఫీలను అప్ లోడ్ చేయl వచ్చని, అలా చేయడం ద్వారా, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి, బానిసత్వ మనస్తత్వాన్ని తొలగించడానికి, మన గొప్ప వారసత్వం గురించి గర్వపడటానికి, ఐక్యత , సంఘీభావాన్ని నిలబెట్టడానికి, పౌరులుగా విధులను నెరవేర్చడానికి, దేశాన్ని రక్షించే వారిని గౌరవించడానికి వారు పంచ ప్రాణ్ ప్రతిజ్ఞ తీసుకుంటారని

చెప్పారు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత డిజిటల్ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ ను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు.

 

గత ఏడాది 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం అందరి భాగస్వామ్యంతో విజయవంతం అయింది.

ఈ ఏడాది కూడా హర్ ఘర్ తిరంగాను 2023 ఆగస్టు 13 నుంచి 15 వరకు జరుపుకోనున్నారు. ఎక్కడైనా భారతీయులు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, తిరంగాతో సెల్ఫీ దిగి హర్ ఘర్ తిరంగా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకోవచ్చు. (harghartiranga.com)

 

దేశవ్యాప్త ప్రచారానికి సంబంధించిన వివరాలను https:// yuva.gov.in/meri_maati_mera_desh పోర్టల్ లో చూడవచ్చని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి మీతా రాజీవ్ లోచన్ తెలియజేశారు. ఈ పోర్టల్ లో మేరీ

మాటీ మేరా దేశ్ క్యాంపెయిన్ కింద వివిధ కార్యకలాపాలకు సంబంధించిన సంబంధిత సమాచారం ఉండటమే కాకుండా, యువత సెల్ఫీలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను ఈ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడం ద్వారా ఈ పోర్టల్ ద్వారా ప్రచారంలో పాల్గొనవచ్చు.

యువత ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొనాలని, మన సాహస వీరులకు,  మన మాతృభూమికి నివాళులు అర్పించే దేశవ్యాప్త ప్రయత్నంలో తమ చుట్టూ ఉన్న వారందరినీ భాగస్వాములను చేయాలని ఆమె కోరారు.

 

ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఒ) శ్రీ గౌరవ్ ద్వివేది మాట్లాడుతూ, ఆకాశవాణి, దూరదర్శన్ , ప్రసార భారతి ఇతర డిజిటల్ ప్లాట్ ఫారం ల ద్వారా మేరీ

మాటీ మేరా దేశ్ ప్రచారానికి మీడియా కవరేజ్ వివరాలను తెలిపారు. అందించారు.

 

'మేరీ మాటీ మేరా దేశ్' క్యాంపెయిన్ ఆగస్టు 9 న ప్రారంభమవుతుంది, 2023 ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం వరకు ముందుగా షెడ్యూల్ చేసిన కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి కార్యక్రమాలు 2023 ఆగస్టు 16 నుండి బ్లాక్, మున్సిపాలిటీ / కార్పొరేషన్ , రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి. 2023 ఆగస్టు 30న న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్  లో ప్రముఖుల సమక్షంలో ముగింపు వేడుకలు జరుగుతాయి.

 

****



(Release ID: 1945628) Visitor Counter : 665