ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రాన్స్ ఉన్నతసభ అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
13 JUL 2023 10:34PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫ్రాన్స్ ఉన్నత సభ అధ్యక్షుడు శ్రీ జెరార్డ్ లార్శల్ తో 2023 జులై 13 వ తేదీ న సమావేశమయ్యారు.
భారతదేశం - ఫ్రాన్స్ భాగస్వామ్యాని కి సభ్యత పరం గా పునాది గా నిలచిన ‘ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ మరియు సమానత్వం’ అనేటటువంటి మన ఉమ్మడి విలువల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావించారు.
విస్తృత స్థాయి లో జరిగిన చర్చల లో, జి-20 లో భారతదేశం యొక్క ప్రాథమ్యాలు, సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడం లో ప్రజాస్వామిక విలువలు మరియు రెండు దేశాల ఉన్నత సభ ల మధ్య సహకారం సహా అనేక రంగాలు చోటు చేసకొన్నాయి. పరస్పర ప్రయోజనం ముడిపడి ఉన్నటువంటి ప్రాంతీయ అంశాలు మరియు ప్రపంచ అంశాల పైన కూడా చర్చ జరిగింది.
***
(रिलीज़ आईडी: 1939489)
आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam