సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత్-చైనా సరిహద్దుల్లోని సరిహద్దు గ్రామాల్లో ఉచితంగా డిష్ సౌకర్యం కల్పించి, ఆకాశవాణి ప్రసారాలు మెరుగుపరచడానికి చర్యలు అమలు చేస్తాం ... కేంద్ర మంత్రి : శ్రీ అనురాగ్ ఠాకూర్
మారుమూల గ్రామాల్లో మొబైల్ సేవలు మెరుగు పరచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది: శ్రీ అనురాగ్ ఠాకూర్
లడఖ్‌లోని కర్జోక్ గ్రామంలోఐటిబిటి జవాన్లతో రాత్రి బస చేసిన శ్రీ ఠాకూర్
Posted On:
13 JUL 2023 4:23PM by PIB Hyderabad
భారత్-చైనా సరిహద్దుల్లోని సరిహద్దు గ్రామాల్లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉచితంగా దూరదర్శన్ డిష్ సౌకర్యం కల్పిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. మారుమూల గ్రామాల్లో మొబైల్ సేవలు మెరుగు పరచడానికి త్వరలో చర్యలు అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సరిహద్దు గ్రామాల్లో ప్రసార సౌకర్యాలు మెరుగు పరచడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
లేహ్‌కు 211 కిలోమీటర్ల దూరంలో ఉన్న లడఖ్‌లోని కర్జోక్ గ్రామంలో గ్రామస్థులతో సమావేశం అయిన శ్రీ ఠాకూర్ ప్రభుత్వం అమలు చేయనున్న చర్యలను వివరించారు.
మారుమూల ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రసార కార్యక్రమాలు చూసే సౌకర్యం కల్పించడానికి ఉచితంగా డీడీ డిష్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరిహద్దు ప్రాంతంలో 1.55 లక్షల డిష్ లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి శ్రీ ఠాకూర్ స్పష్టం చేశారు. మెరుగైన డిజిటల్ ప్రసారాలు అందించి రహదారి సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి అవసరమైనమౌలిక సదుపాయాలను మెరుగుపరచడం,క్రీడా సౌకర్యాలు కల్పించి, జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి అమలు చేస్తామని శ్రీ ఠాకూర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సందర్శన కార్యక్రమంలో భాగంగా శ్రీ ఠాకూర్ లేహ్-లడఖ్ లో మూడు రోజుల పర్యటన చేపట్టారు. కర్జోక్ గ్రామంలో బస చేసిన మంత్రి , కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్న తీరును అధికారులతో సమీక్షించారు. కర్జోక్ వద్ద క్రీడా పరికరాలు పంపిణీ చేసిన మంత్రి , ఇండో-చైనా సరిహద్దుల్లో సముద్ర మట్టానికి 15000 అడుగుల ఎత్తులో ఉన్న కర్జోక్ ప్లాటూన్ పోస్ట్ వద్ద ఐటిబిటి జవాన్లతో మాట్లాడారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రాజెక్టులు, పథకాలు అమలు జరుగుతున్న తీరును మంత్రి ఇండో-చైనా సరిహద్దు లోని మారుమూల సరిహద్దు గ్రామంలో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసు కున్న మంత్రి స్థానిక ప్రజలు, అధికారులతో మాట్లాడారు.
అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి ఖార్నాక్, సమద్ గ్రామాల్లో పర్యటించిన మంత్రి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నా. ఖర్నాక్ వద్ద, దాద్ ఖర్నాక్ జాతీయ రహదారిని కలుపుతూ నిర్మించిన రహదారిని ఆయన ప్రారంభించారు.
సౌర విద్యుత్ తాగునీరు, 32కుటుంబాలకు గృహ సౌకర్యం, , సైక్లింగ్ ట్రాక్, కృత్రిమ సరస్సు, టూరిజం సబ్సిడీ తదితర అంశాలపై మంత్రి చర్చించారు. అంతేకాకుండా, సరిహద్దు భద్రత, రోడ్ల అభివృద్ధి, మొబైల్ టవర్లు, వన్యప్రాణుల సమస్యలు లాంటి అంశాలను మంత్రి స్థానికులతో చర్చించారు.
కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత లడఖ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు జరుగుతున్నాయని శ్రీ ఠాకూర్ తెలిపారు. ప్రత్యేక నిధులు, 24 గంటల విద్యుత్, సోలార్ ప్లాంట్ ఏర్పాటు, రూ. 21000 కోట్ల ఖర్చు మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల ప్రజలకు జీవనోపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని మంత్రి అన్నారు.
చాంగ్‌తంగ్ ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలోని ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ (జేజేఎం) ద్వారా నీటి సరఫరా సౌకర్యం కల్పించామని మంత్రి తెలిపారు.
చాంగ్‌తంగ్ దాని చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి అమలు చేయనున్న కార్యక్రమాలను మంత్రి ప్రజలకు వివరించారు. రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడం, ప్రాంతం సహజ సౌందర్యాన్ని ప్రభావితం చేయడానికి పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు అమలు జరుగుతాయని మంత్రి తెలిపారు.కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ, వనరులను ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
మోదీ ప్రభుత్వ సమిష్టి కృషి వల్ల చాంగ్‌తాంగ్‌లో పర్యాటక రంగం అభివృద్ధి చుండుతుందని మంత్రి తెలిపారు.
పర్యటనలో భాగంగా శ్రీ ఠాకూర్ పుగా రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిర్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా వాలీబాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ క్రీడా పరికరాలు, కిట్లను పంపిణీ చేసింది. కర్జోక్ పాఠశాలలో పరికరాలు పంపిణీ చేశారు. మంత్రి సెల్‌ఫోన్/మొబైల్ వెలుతురులో టేబుల్ టెన్నిస్ ఆడారు.
చుమూర్ వద్ద శ్రీ ఠాకూర్ జవాన్ల ను కలుసుకుని వారితో మాట్లాడారు. రోడ్డు సౌకర్యం, టెలికాం, జెజెఎం తదితర సమస్యలను మంత్రికి గ్రామస్తులు వివరించారు. గ్రామానికి 7 కి.మీ మేర రహదారి సౌకర్యాన్ని ప్రతిపాదించామని, దీనికి సంబంధించి డీపీఆర్ సిద్ధంగా ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీడబ్ల్యూడీ మంత్రికి వివరించారు.
37వ ఐటిబిటి పోస్ట్‌లోని జవాన్లతో మాట్లాడిన మంత్రి సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్న దళాలకు మెరుగైన పోరాట దుస్తులు, ఆయుధాలు, మేక్ ఇన్ ఇండియా చొరవ మరియు పెన్షన్లు వంటి అన్ని సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు వివరించారు.
***
(Release ID: 1939480)
Visitor Counter : 162
Read this release in:
Kannada
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil