యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దక్షిణాసియా ప్రాంతీయ డోపింగ్ నిరోధక సంస్థ (ఎస్ ఎ ఆర్ డి ఒ) తో ఢిల్లీ లో అవగాహన ఒప్పందం పై సంతకాలు చేసిన భారత జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా ఇండియా)


క్రీడల్లో డోపింగ్ నిరోధానికి ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం.

వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, యునెస్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగైనెస్ట్ డోపింగ్ ఇన్ స్పోర్ట్స్ కు భారత్ అందిస్తున్న సహకారం డోపింగ్ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ సంసిద్ధతను, బలమైన ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది: అనురాగ్ ఠాకూర్

Posted On: 03 JUL 2023 3:47PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార-  ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడల శాఖ కార్యదర్శి సుజాతా చతుర్వేది, ఎస్ ఎ ఆర్ డి ఒ సెక్రటేరియట్ ,  బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్ , శ్రీలంక సభ్య దేశాల సమక్షంలో, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్,  శ్రీలంక దేశాల యాంటీ డోపింగ్ ఆర్గనైజేషన్ లతో కూడిన ఎస్ ఎ ఆర్ డి ఒ (సారడో ) తో నాడా ఇండియా ఈ రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

 

క్రీడల్లో డోపింగ్ నిరోధానికి  ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం.

 

ఈ సందర్భంగా శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ,  అంతర్జాతీయ క్రీడారంగంలో భారతదేశ పెరుగుతున్న భాగస్వామ్యం , విజయాలను , స్వచ్ఛమైన క్రీడా ప్రయత్నాలను ప్రోత్సహించడంలో బాధ్యతను భుజాన వేసుకోవడానికి,  ప్రపంచ డోపింగ్ వ్యతిరేక ఉద్యమానికి దోహదం చేయడానికి గల భారత ఉత్సుకతను ప్రముఖంగా వివరించారు.

 

శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ" రాబోయే సంవత్సరాల్లో భారతదేశం క్రీడా శక్తి కేంద్రంగా మారాలన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కలను సాకారం చేయడానికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత అథ్లెట్ల క్రీడా ప్రదర్శనను మెరుగు పరచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోందని  తెలిపారు.

 

"అధిక నాణ్యమైన శిక్షణ, అందుబాటులో ఉన్న , మెరుగైన క్రీడా మౌలిక సదుపాయాలు, పోటీలు , శిక్షణా శిబిరాల ద్వారా అన్ని క్రీడలకు అవకాశాలను పెంచడం, క్రీడలలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రధాన స్రవంతి ప్రయత్నాలపై మన పెరుగుతున్న దృష్టి ప్రపంచవ్యాప్తంగా క్రీడల అభివృద్ధికి దోహదం చేయాలనే భారతదేశ ఉద్దేశం,  ఆకాంక్షను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది" అని ఆయన అన్నారు.

 

ప్రపంచ ఉత్తర , ప్రపంచ దక్షిణాల మధ్య అంతరాన్ని పరిష్కరించడానికి , ఆసియా ప్రాంతంలోని మన స్నేహితులకు ఆర్థిక,  సామాజిక వృద్ధికి అవకాశాలను సృష్టించడానికి భారతదేశం వారధిగా పనిచేస్తుందని శ్రీ అనురాగ్ ఠాకూర్ అన్నారు.

 

వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, యునెస్కో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అగైనెస్ట్ డోపింగ్ ఇన్ స్పోర్ట్స్ కు భారత్ అందిస్తున్న సహకారం ప్రపంచవ్యాప్తంగా డోపింగ్ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడంలో పాలుపంచుకునేందుకు, యాంటీ డోపింగ్ కార్యక్రమాలను బలోపేతం చేయడానికి నిరంతరం కట్టుబడి ఉండటానికి భారతదేశ సుముఖత , బలమైన ఉద్దేశ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.

 

భారత్ ప్రస్తుతం జి 20 అధ్యక్ష హోదాను కలిగి ఉన్నందున, ఆసియా ప్రాంత ఆందోళనలు , దృక్పథాలను ప్రపంచానికి తెలియజేయడంపై దృష్టి సారించిందని ఆయన తెలియచేశారు. ప్రాంతీయ భాగస్వామ్యాల ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు, ఇది ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ,సాధికార విధానంతో అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది, ఇతర రంగాలలో సహకారానికి తోడ్పడుతుంది. యాంటీ డోపింగ్ డొమైన్ లో భారత్ కు మొట్టమొదటి ఎంవోయూ కుదుర్చుకున్నందుకు నాడా ఇండియా, సారడోలను అభినందిస్తూ, క్రీడల అభివృద్ధిలో ఇతర అంశాలపై దృష్టి సారించాలని, ఆసియా ప్రాంతంలో ప్రాంతీయ సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఈ ప్రాంత  సభ్య దేశాలను ఆయన కోరారు.

 

క్రీడా రంగంలో డోపింగ్ నిరోధక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు సారడో సభ్య దేశాలు కలిసి యుద్ధ ప్రాతిపదిక పై పనిచేయాలని కేంద్ర మంత్రి కోరారు.

 

నాడా ఇండియా డైరెక్టర్ జనరల్ అండ్ సీఈఓ శ్రీమతి రీతూ సైన్ , సారడో డైరెక్టర్ జనరల్ శ్రీ మొహమ్మద్ మహిద్ షరీఫ్ తమ సంస్థల తరఫున అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఎమ్ఒయు, ప్రాజెక్ట్ ప్లాన్ ,  సహకార రంగాల ద్వారా, మూడు సంవత్సరాల కాలంలో ఈ క్రింది లక్ష్యాలను నెరవేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది:

 

దక్షిణాసియాలో యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ ను అభివృద్ధి చేయడం;

నమూనా సేకరణ సిబ్బంది, విద్యావేత్తలు,  ఇతర యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు శిక్షణ , అప్ స్కిల్లింగ్;

యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ పై కోర్సులు, సెమినార్లు, వర్క్ షాప్ లు, రీసెర్చ్ అండ్ ఎక్స్ఛేంజ్ టూర్ లను నిర్వహించడం; యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్ పై ఎడ్యుకేషన్ ఆఫీసర్లు, ప్రోగ్రామ్ మేనేజర్లు, ట్రైనర్లు, టీచర్లు , స్పెషలిస్టుల మార్పిడిని సులభతరం చేయడం;

యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ఇంకా నిపుణుల సేవలను మార్పిడి చేయడం; యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ సాహిత్యాన్ని రూపొందించడం. 

 

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి  శ్రీమతి సుజాత చతుర్వేది, వాడా ఆసియా / ఓషియానియా కార్యాలయం డైరెక్టర్ శ్రీ కజుహిరో హయాషి, నాడా ఇండియా డైరెక్టర్ జనరల్ అండ్ సిఇఒ శ్రీమతి రీతూ సైన్ , సారడో డైరెక్టర్ జనరల్ శ్రీ మొహమ్మద్ మహిద్ షరీఫ్ కూడా ఈ సమావేశంలో ప్రసంగించారు.

 

ప్రారంభ సెషన్ తరువాత నాడా ఇండియా , సారడో సభ్యుల మధ్య మొదటి ప్రాజెక్ట్ ప్లాన్ సమావేశం జరిగింది, ఇక్కడ దక్షిణాసియా ప్రాంతానికి యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ను అభివృద్ధి చేసే ఉద్దేశ్యం గురించి చర్చించారు. ప్రాజెక్టు ప్రణాళిక, సహకార రంగాలు, అమలు వ్యూహం, ఫలితాలను పర్యవేక్షించే యంత్రాంగాలు, నాడా ఇండియా యాంటీ డోపింగ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, వనరులపై నాడా ఇండియా బృందం ఒక అవలోకనాన్ని సమర్పించింది. బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక సభ్యదేశాల ప్రతినిధులు తమ దేశాల్లోని యాంటీ డోపింగ్ గురించి వివరించారు.

 

***


(Release ID: 1937156) Visitor Counter : 161