ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని బుల్దానాలో బస్సు దుర్ఘటనవల్ల ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం


ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి నష్టపరిహారం ప్రకటన

प्रविष्टि तिथि: 01 JUL 2023 10:22AM by PIB Hyderabad

   ‌హారాష్ట్ర‌లోని బుల్దానాలో సంభవించిన బ‌స్సు ప్ర‌మాదంలో ప్రాణనష్టంపై ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల వంతున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“మహారాష్ట్రలోని బుల్దానాలో దారుణ బస్సు దుర్ఘటనపై ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక అధికార యంత్రాంగం బాధితులకు అన్నివిధాలా చేయూతనిస్తున్నట్లు తెలిపారు.” అని తెలిపింది. అంతేకాకుండా:

   “బస్సు దుర్ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 వంతున పరిహారం అందించబడుతుంది” అని తెలిపింది.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1936780) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam