ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జులై 1 వ తేదీ నాడు జరిగే పదిహేడో ఇండియన్ కో ఆపరేటివ్ కాంగ్రెస్  ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి    


‘అమృత్ కాలం: ఒక చైతన్య వంతమైనటువంటి భారతదేశాన్నిఆవిష్కరించడం కోసం సహకారం ద్వారా సమృద్ధి’ అనే అంశం ఈ సభ కు ఇతివృత్తంగా ఉంది

Posted On: 30 JUN 2023 3:09PM by PIB Hyderabad

జూలై 1 వ తేదీ నాడు సహకార సంఘాల అంతర్జాతీయ దినం సందర్భం లో ఉదయం 11 గంటల వేళ కు న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో జరిగే పదిహేడో ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెసు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

 

‘సహకార్ సే సమృద్ధి’ సంబంధి దార్శనికత పట్ల ప్రధాన మంత్రి కి ఉన్నటువంటి ప్రగాఢ విశ్వాసం తో స్ఫూర్తి ని పొందిన ప్రభుత్వం దేశం లో సహకార ఉద్యమాని కి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు నిరంతరాయం గా చర్యల ను చేపడుతూ వస్తోంది. ఈ ప్రయాస కు బలాన్ని ఇవ్వడానికని ప్రత్యేకం గా సహకార మంత్రిత్వ శాఖ నంటూ ఒక మంత్రిత్వ శాఖ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ కార్యక్రమం లో పాలుపంచుకోవడం ఈ దిశ లో మరో ముందడుగు అని చెప్పాలి.

 

పదిహేడో ఇండియన్ కోఆపరేటివ్ కాంగ్రెస్ ను 2023 జూలై 1 మరియు 2వ తేదీల లో నిర్వహించడం జరుగుతుంది. సహకార ఉద్యమం లో వివిధ ధోరణుల ను గురించి చర్చించి, ప్రస్తుతం ఆచరిస్తున్న ఉత్తమ అభ్యాసాల ను చాటిచెప్పడం, ఈ రంగం లో ఎదురవుతున్న సవాళ్ళ ను గురించి చర్చోపచర్చల ను జరపడం మరియు భారతదేశం లో సహకార ఉద్యమం యొక్క వృద్ధి కై రాబోయే కాలం లో అమలుపరచవలసిన విధాన పరమైనటువంటి దిశ ను రూపొందించుకోవడం ఈ కాంగ్రెస్ యొక్క ధ్యేయాలు గా ఉన్నాయి. ‘‘అమృత కాలం: ఒక చైతన్య వంతమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం సహకార రంగం ద్వారా సమృద్ధి ని సాధించడం’’ అనే ప్రధాన ఇతివృత్తం పై ఆధారపడే ఏడు సాంకేతిక సదస్సుల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో 3600 కు పైగా స్టేక్ హోల్డర్స్ పాలుపంచుకొంటారు. వారి లో ప్రాథమిక స్థాయి మొదలుకొని జాతీయ స్థాయి వరకు విస్తరించినటువంటి సహకార సంఘాలు, అంతర్జాతీయ సహకార సంస్థల ప్రతినిధులు, ఇంటర్ నేశనల్ కోఆపరేటివ్ అలయన్స్ ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ లు, విశ్వవిద్యాలయాలు, ప్రముఖ సంస్థ లు, తదితర వర్గాల ప్రతినిధులు కూడా కలసి ఉంటారు.

 

***

 



(Release ID: 1936407) Visitor Counter : 183