ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జులై 1 వ తేదీ నాడు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి


నేశనల్ సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశను నుప్రారంభించనున్న ప్రధాన మంత్రి

శాహ్ డోల్ జిల్లా లో  పకరియా గ్రామాన్ని సందర్శించడం తో పాటు ఆ పల్లె లోనివివిధ వర్గాల వారి తో మాట్లాడనున్న ప్రధాన మంత్రి   

రాష్ట్రవ్యాప్తం గా ఇంచుమించు 3.57 కోట్ల మంది లబ్ధిదారుల కు ఆయుష్మాన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

గోండ్ వానా ను ఏలిన ధైర్యవతి, 16 వ శతాబ్ది రాణి దుర్గావతి కి పుష్పాంజలి నిసమర్పించనున్న ప్రధాన మంత్రి 

Posted On: 30 JUN 2023 2:05PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జులై 1 వ తేదీ నాడు మధ్య ప్రదేశ్ ను సందర్శించనున్నారు.

 

మధ్యాహ్నం సుమారు 3:30 గంటల వేళ లో శాహ్ డోల్ లో జరిగే ఒక సార్వజనిక కార్యక్రమాని కి ప్రధాన మంత్రి హాజరు అయ్యి, అక్కడ నేశనల్ సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశను ను ప్రారంభిస్తారు. లబ్ధిదారుల కు సికల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డుల ను ఆయన ప్రదానం చేస్తారు.

 

సికల్ సెల్ వ్యాధి కలగజేస్తున్న తీవ్రమైన ఆరోగ్య సంబంధి సవాళ్ళ ను, మరీ ముఖ్యం గా గిరిజనుల విషయం లో రువ్వుతన్న సవాళ్ల ను ఎదుర్కొని పరిష్కరించడం ఈ మిశన్ ధ్యేయం గా ఉన్నది. ఈ మిశను ను ప్రారంభించడం అనేది 2047 వ సంవత్సరాని కల్లా సికల్ సెల్ డిజీజ్ ను ఒక సార్వజనిక ఆరోగ్య సమస్య స్థాయి నుండి పూర్తి గా మటుమాయం చేసే దిశ లో ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రయాసల లో ఒక కీలకమైన మైలురాయి గా నిలవనుంది. నేశనల్ సికల్ సెకిల్ సెల్ అనీమియ మిశను ను 2023 వ సంవత్సర కేంద్ర బడ్జెటు లో ప్రకటించడమైంది. దీనిని దేశం లోని 17 రాష్ట్రాల పరిధి లో 278 జిల్లాల లో అమలు చేయడం జరుగుతుంది. 17 రాష్ట్రాల లో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఝార్ ఖండ్, ఛతీస్ గఢ్, పశ్చిమ బంగాల్, ఒడిశా, తమిళ నాడు, కర్నాటక, అసమ్, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, బిహార్, ఉత్తరాఖండ్ లతో పాటు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.

 

మధ్య ప్రదేశ్ లో సుమారు 3.57 కోట్ల ‘ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన’ (ఎబి-పిఎమ్ జెఎవై) కార్డుల పంపిణీ ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆయుష్మాన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తం గా పట్టణ సంస్థ లు, గ్రామ పంచాయతీ లు మరియు డెవలెప్ మెంట్ బ్లాకుల లో నిర్వహించడం జరుగుతుంది. సంక్షేమ పథకాల ను లబ్ధిదారుల లో ప్రతి ఒక్కరి కి అందించాలనే ప్రధాన మంత్రి యొక్క దృష్టికోణాన్ని సాకారం చేసే దిశ లో వేసేటటువంటి ఒక అడుగు గా ఆయుష్మాన్ కార్డు ల పంపిణీ కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు.

 

ఈ కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి 16 వ శతాబ్దం మధ్య కాలం లో గోండ్ వానా ను పాలించిన రాణి దుర్గావతి కి పుష్పాంజలి ని ప్రధాన మంత్రి సమర్పించనున్నారు. మొగలుల కు వ్యతిరేకం గా స్వాతంత్య్ర పోరాటాన్ని జరిపిన ధైర్యం, సాహసాల ను కలిగిన, భయమన్నదే ఎరుగనటువంటి యోధురాలు గా రాణి దుర్గావతి ని ప్రజలు ఈనాటికీ

స్మరించుకోవడం జరుగుతోంది.

 

ఈ ప్రత్యేకమైన కార్యక్రమం లో భాగం గా, శాహ్ డోల్ జిల్లా లో పకరియా గ్రామాన్ని ప్రధాన మంత్రి సాయంత్రం 5 గంటల వేళ లో సందర్శించడం తో పాటు ఆదివాసి సముదాయం యొక్క అగ్రగామి వ్యక్తుల తో, స్వయం సహాయ సమూహాల తో, పిఇఎస్ఎ [పంచాయత్ (ఎక్స్ టెన్శన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్) యాక్టు, 1996] సమితుల యొక్క నేతల తో, విలేజ్ ఫుట్ బాల్ క్లబ్స్ యొక్క సారధుల తో భేటీ అయ్యి వారి తో మాట్లాడనున్నారు.

 

***

 


(Release ID: 1936406) Visitor Counter : 167