గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ ఆధ్వర్యంలో "గణాంకాల దినోత్సవం" నిర్వహణ
ఇతివృత్తం: "సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పర్యవేక్షించడానికి జాతీయ సూచిక విధానాలతో రాష్ట్రాల సూచిక విధానాలను ఏకీకృతం చేయడం"
Posted On:
29 JUN 2023 3:05PM by PIB Hyderabad
గణాంకాలు, ఆర్థిక ప్రణాళిక రంగాల్లో స్వర్గీయ ప్రొ. ప్రశాంత చంద్ర మహలనోబిస్ చేసిన విశేష కృషికి గుర్తింపుగా, ఆయన జన్మదినం సందర్భంగా, 2007 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 29న “గణాంకాల దినోత్సవం”గా భారత ప్రభుత్వం జరుపుతోంది.
ఈ సంవత్సరం గణాంకాల దినోత్సవాన్ని, ఇవాళ, న్యూదిల్లీలోని స్కోప్ కాంప్లెక్స్‌లో ఉన్న స్కోప్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. భారత గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావ్ ఇంద్రజిత్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ప్రసంగించారు. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ప్రొ.రాజీవ లక్ష్మణ్ కరాండికర్, భారతదేశ ముఖ్య గణాంకాధికారి & మంత్రిత్వ శాఖ కార్యదర్శి డా.జి.పి.సమంత కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్ర/యూటీ ప్రభుత్వాల ప్రతినిధులు, యూఎన్ సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయింది.
"ఆన్ ది స్పాట్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, 2023" విజేతలను కూడా ఈ కార్యక్రమంలో సత్కరించారు.
మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశుతోష్ ఓజా 2023 గణాంకాల దినోత్సరం ఇతివృత్తంపై సంక్షిప్త ప్రదర్శన ఇచ్చారు. భారతదేశంలో యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ శోంబి షార్ప్, నీతి ఆయోగ్ సీనియర్ సలహాదారు డాక్టర్ యోగేష్ సూరి, నీతి ఆయోగ్ డైరెక్టర్ రాజేష్ గుప్తా కూడా 2023 గణాంకాల దినోత్సవం ఇతివృత్తంపై ప్రసంగించారు.
ఈ సందర్భంగా, "సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-జాతీయ సూచిక విధానాలు, ప్రగతి నివేదిక, 2023"ను ఆవిష్కరించారు. నివేదికతో పాటు, "సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-జాతీయ సూచిక విధానాలు, 2023" డేటా స్నాప్‌షాట్ కూడా విడుదల చేశారు. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ నుంటి లక్ష్యాల వారీ సమాచారాన్ని ఎక్సెల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
*****
(Release ID: 1936241)
Visitor Counter : 202