ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రాల మూలధన వ్యయాలకు సకాలంలో ఊతమివ్వడానికి ‘మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం 2023-24’ పథకం కింద మూలధన పెట్టుబడుల కోసం 16 రాష్ట్రాలకు రూ.56,415 కోట్లను ఆమోదించిన కేంద్రం

Posted On: 26 JUN 2023 4:00PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 రాష్ట్రాల్లో రూ.56,415 కోట్లు మూలధన పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది.  ‘మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం 2023-24’ పథకం కింద ఆమోదం లభించింది. రాష్ట్రాల వారీగా ఆమోదించిన  మొత్తం క్రింది విధంగా ఉంది: - 

 (రూ.కోట్లలో)

క్రమ సంఖ్య 

రాష్ట్రం 

ఆమోదం పొందిన నిధులు 

 1. 

అరుణాచల్ ప్రదేశ్ 

1255

 2. 

బీహార్ 

9640

 3. 

ఛత్తీస్గఢ్ 

3195

 4. 

గోవా 

386

 5. 

గుజరాత్ 

3478

 6. 

హర్యానా 

1093

 7. 

హిమాచల్ ప్రదేశ్ 

826

 8. 

కర్ణాటక 

3647

 9. 

మధ్యప్రదేశ్ 

7850

 10. 

మిజోరాం 

399

 11. 

ఒడిశా 

4528

 12. 

రాజస్థాన్ 

6026

 13. 

సిక్కిం 

388

 14. 

తమిళనాడు 

4079

 15. 

తెలంగాణ 

2102

 16. 

పశ్చిమ బెంగాల్ 

7523

 

ఆరోగ్యం, విద్య, నీటిపారుదల, నీటి సరఫరా, విద్యుత్, రోడ్లు, వంతెనలు,  రైల్వేలతో సహా విభిన్న రంగాలలో మూలధన పెట్టుబడి ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. జల్ జీవన్ మిషన్,  ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద  రాష్ట్ర వాటాతో చేరుస్తు  నిధులు కూడా ఈ రంగాల్లోని ప్రాజెక్టుల వేగాన్ని పెంచడానికి ఈ పథకం కింద రాష్ట్రాలకు అందించారు.

మూలధన వ్యయం అధిక గుణకార ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు మూలధన వ్యయాలకు ప్రోత్సాహాన్ని అందించడానికి, 'మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం 2023-24' 2023-24 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వాలకు 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణం రూపంలో మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో  రూ.1.3 లక్షల కోట్లు ఇవ్వనున్నారు.

ఈ పథకం ఎనిమిది భాగాలను కలిగి ఉంది, పార్ట్-1 రూ.1 లక్ష కోట్లు కేటాయింపులతో అతిపెద్దది.  15వ ఆర్థిక సంఘం అవార్డు ప్రకారం కేంద్ర పన్నులు, సుంకాల వాటాకు అనుగుణంగా రాష్ట్రాల మధ్య ఈ మొత్తం కేటాయించారు. స్కీమ్‌లోని ఇతర భాగాలు సంస్కరణలకు అనుసంధానించి ఉంటాయి లేదా సెక్టార్ నిర్దిష్ట ప్రాజెక్టులకు సంబంధించినవిగా ఉంటాయి. 

పథకం  పార్ట్-IIలో, రాష్ట్ర ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్‌లను రద్దు, పాత వాహనాలపై బకాయిల మినహాయింపు, పాత వాహనాలను రద్దు  కోసం వ్యక్తులకు పన్ను రాయితీలు అందించడం, ఆటోమేటెడ్ వాహన పరీక్ష సౌకర్యాల ఏర్పాటు కోసం రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించడానికి రూ.3,000 కోట్లు కేటాయించారు. పథకం పార్ట్-III & IV పట్టణ ప్రణాళిక, అర్బన్ ఫైనాన్స్‌లో సంస్కరణల కోసం రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. రూ. 15,000 కోట్లు అర్బన్ ప్లానింగ్ సంస్కరణలకు కేటాయించగా, అదనంగా రూ. 5,000 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలను క్రెడిట్ యోగ్యమైనవిగా చేయడం, వాటి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం రాష్ట్రాలను ప్రోత్సహించడం కోసం కేటాయించారు. 

పట్టణ ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్‌ల పరిధిలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబాలకు గృహాలను పెంచడం కూడా ఈ పథకం లక్ష్యం.  పథకంలోని పార్ట్-V కింద దీని కోసం రూ. 2,000 కోట్లు కేటాయించారు. ప్రతి రాష్ట్రంలో యూనిటీ మాల్‌ను నిర్మించడం ద్వారా జాతీయ సమగ్రతను ప్రోత్సహించడం, “మేక్ ఇన్ ఇండియా” భావనను ముందుకు తీసుకెళ్లడం, “ఒక జిల్లా, ఒక ఉత్పత్తి (ఓడిఓపి)” అనే భావనను ప్రచారం చేయడం ఈ పథకం  మరొక లక్ష్యం. పథకంలోని పార్ట్-VI కింద రూ. 5,000 కోట్లు కేటాయించారు.

పథకం పార్ట్-VII,  పిల్లలు, యుక్తవయసుల వారి కోసం పంచాయతీ, వార్డు స్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాలతో లైబ్రరీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించడం కోసం రూ.5,000 కేటాయించారు. 

'2022-23 మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం' పేరుతో ఇదే విధమైన పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత ఆర్థిక సంవత్సరంలో కూడా అమలు చేసింది. పథకం కింద, మూలధన పెట్టుబడి ప్రతిపాదనలు రూ. 95,147.19 కోట్లుగా ఆమోదించారు మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ. 81,195.35 కోట్లు విడుదలయ్యాయి. 

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో 2020-21 లో ఆర్థిక మంత్రిత్వ శాఖ తొలిసారిగా ప్రారంభించిన మూలధన పెట్టుబడి/వ్యయాల కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయం కోసం పథకం చాలా సమయానుకూలంగా అందించడం జరిగింది. రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని పెంచుతాయి. పథకం రూపకల్పన  సౌలభ్యం, సరళత వరుసగా బడ్జెట్‌కు ముందు సంప్రదింపులలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రుల నుండి ఉదారమైన ప్రశంసలను పొందింది.

 

****


(Release ID: 1935495) Visitor Counter : 259