ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం

Posted On: 23 JUN 2023 7:33AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ హౌస్ ఆప్ రిప్రెజెంటెటివ్స్ స్పీకర్ శ్రీ కెవిన్ మేక్ కార్థీ, సీనెట్ లో సంఖ్యాబలమున్న నేత శ్రీ చార్ల్ స్ శూమర్, సీనెట్ లో రిపబ్లికన్ పార్టీ నేత శ్రీ మిచ్ మేక్ కోనెల్ మరియు సభ లో డెమోక్రెటిక్ పార్టీ నేత శ్రీ హకీమ్ జెఫ్రీస్ లు ఆహ్వానించిన మీదట 2023 వ సంవత్సరం లో జూన్ 22 తేదీ న యుఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు కమలా హేరిస్ గారు కూడా హాజరయ్యారు.

కేపిటల్ హిల్ కు ప్రధాన మంత్రి చేరుకోవడం తోనే కాంగ్రెస్ నాయకులు లాంఛనపూర్వకం గా స్వాగతం పలికారు. దీని తరువాత, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సభ స్పీకర్ శ్రీ కెవిన్ మేక్ కార్థీ తో మరియు కాంగ్రెస్ లోని వివిధ నేతల తో కలసి విడి విడి గా సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, భారతదేశం-యుఎస్ మధ్య సంబంధాల ను బలపరచడం కోసం యుఎస్ కాంగ్రెస్ దీర్ఘకాలం గా లభిస్తున్నటువంటి మరియు బలమైనటువంటి ద్విపక్షీయ సమర్థన ను ప్రశంసించారు.

భారతదేశం-యుఎస్ ద్వైపాక్షిక సంబంధాల లో శరవేగం గా చోటుచేసుకొన్న ప్రగతి ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా పెంపొందింప చేసుకొనే విషయం లో తన దృష్టి కోణాన్ని ఆయన వెల్లడించారు. భారతదేశం యొక్క విస్తృతమైన ప్రగతి ని మరియు ప్రపంచాని కి భారతదేశం ఇవ్వజూపుతున్న అవకాశాల ను గురించి కూడా ఆయన వివరించారు.

స్పీకర్ శ్రీ మేక్ కార్థీ ప్రధాన మంత్రి యొక్క గౌరవార్థం ఒక స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా లో కాంగ్రెస్ యొక్క సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించడం ఇప్పటికి ఇది రెండో సారి. ఆయన ఇంతకు ముందు 2016 వ సంవత్సరం సెప్టెంబరు లో యుఎస్ఎ లో తన ఆధికారిక పర్యటన సందర్భం లో యుఎస్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించారు.

 

***


(Release ID: 1934705) Visitor Counter : 207