ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రపంచ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారులకు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 18 JUN 2023 4:31PM by PIB Hyderabad

   ర్మనీలోని బెర్లిన్‌లో నిర్వహించే ప్రత్యేక ప్రపంచ ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“బెర్లిన్‌ నగరంలో ప్రారంభమయ్యే ప్రత్యేక ప్రపంచ ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనబోయే భారత క్రీడాకారుల బృందానికి నా శుభాకాంక్షలు. ఈ క్రీడల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి అథ్లెట్‌ మనకు గర్వకారణం. వారు తమ దృఢదీక్ష; సంకల్పం, పట్టుదల ద్వారా ఉజ్వలంగా ప్రకాశించగలరని నేను విశ్వసిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS


(Release ID: 1933336) Visitor Counter : 165