ప్రధాన మంత్రి కార్యాలయం

జల సంరక్షణపై అవగాహన కల్పనకు ప్రధానమంత్రి పిలుపు

Posted On: 17 JUN 2023 8:29PM by PIB Hyderabad

   వర్షపు నీటి సంరక్షణపై వీధి నాటకం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లా నెహ్రూ యువక కేంద్ర స్వచ్ఛంద కార్యకర్తలు చేసిన ప్రయత్నాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ అంశంపై రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ పెమా ఖండూ ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:

“యువతరం ఇటువంటి ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన వ్యాప్తికి ఇటువంటి ప్రక్రియలు ఎంతగానో దోహదం చేస్తాయి. వర్షపు నీటి సంరక్షణపై ఈ సందేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో దేశవాసులంతా తమవంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS(Release ID: 1933234) Visitor Counter : 103