ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎన్ హెచ్-334బి లో భాగం గా 40.2 కి.మీ. భాగాన్ని నిర్మించడంలో దీర్ఘకాలం పాటు మన్నిక ను కలిగివుండేటటువంటి సామగ్రి ని ఉపయోగించడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 14 JUN 2023 9:45PM by PIB Hyderabad

ఎన్ హెచ్-334బి లో 40.2 కిలో మీటర్ ల మేర రహదారి ని నిర్మించడం కోసం ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఫ్లయ్ ఏశ్ వంటి దీర్ఘకాలం పాటు మన్నిక కలిగివుండేటటువంటి సామగ్రి ని ఉపయోగించడాని కి ప్రాధాన్యాన్ని ఇవ్వడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇలా చేయడం వల్ల ఖర్చు తక్కువ కావడం తో పాటుగా పర్యావరణ అనుకూల ప్రయోజనాలు కూడా సిద్ధిస్తాయి. ఈ రహదారి భాగం యుపి-హరియాణా సరిహద్దు సమీపం లో బాగ్ పత్ వద్ద మొదలై, హరియాణా లోని రోహ్ నా వద్ద ముగుస్తున్నది.

కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ ట్వీట్ కు శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇస్తూ,

‘‘సతత అభివృద్ధి మరియు వృద్ధి చెందిన కనెక్టివిటీ ల పరిపూర్ణమైనటువంటి కలయిక. దీని ద్వారా ఆర్థిక వృద్ధి కి ప్రోత్సాహం లభిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

 

***

DS


(रिलीज़ आईडी: 1932701) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Assamese , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam