ప్రధాన మంత్రి కార్యాలయం
దక్షిణఆఫ్రికా అధ్యక్షుని తో సంభాషించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
బిఆర్ఐసిఎస్లో సహకారం సహా ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ అంశాల పై సమీక్ష ను నిర్వహించినఇద్దరు నేత లు
ఆఫ్రికానేతల శాంతి కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి కి వివరించిన అధ్యక్షుడు శ్రీరామాఫోసా
చర్చలుమరియు దౌత్యం.. ఇవే ముందు కు పోయే మార్గాలు అని భారతదేశం పదే పదే పిలుపునిస్తోందనిపునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి
జి20 కి భారతదేశం అధ్యక్షతవహిస్తున్నందుకు తన పూర్తి సమర్థన ను వ్యక్తం చేసిన అధ్యక్షుడు శ్రీ రామాఫోసా
Posted On:
10 JUN 2023 10:16PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణ ఆఫ్రికా గణతంత్రం అధ్యక్షుడు శ్రీ మతెమెలా సిరిల్ రామాఫోసా తో ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
నేతలు ఇద్దరు చారిత్రిక మరియు సుదృఢమైనటువంటి పరస్పర ప్రజా సంబంధాల పై ఆధారపడి ఉన్న ద్వైపాక్షిక సహకారం లో పురోగతి ని గురించి సమీక్షించారు. ఈ సంవత్సరం మొదట్లో 12 చిరుతపులుల ను భారతదేశం లోకి తీసుకు రావడం లో తోడ్పాటు ను అందించినందుకు గాను దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుని కి ప్రధాన మంత్రి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.
వారు ఈ సంవత్సరం లో దక్షిణ ఆఫ్రికా అధ్యక్షత న బిఆర్ఐసిఎస్ లో సహకారం అంశం తో పాటు గా అనేక ప్రాంతీయ అంశాల ను గురించి మరియు పరస్పర హితం ముడిపడ్డ ప్రపంచ అంశాల ను గురించి ఒకరి అభిప్రాయాల ను మరొకరి కి వెల్లడించుకొన్నారు.
ఆఫ్రికన్ లీడర్స్ పీస్ ఇనిశియేటివ్ ను గురించి ప్రధాన మంత్రి దృష్టి కి అధ్యక్షుడు శ్రీ రామాఫోసా తీసుకు వచ్చారు. యూక్రేన్ లో శాంతి కి మరియు స్థిరత్వాని కి పూచీ పడే ఉద్దేశ్యం తో అమలు పరచే అన్ని కార్యక్రమాల కు భారతదేశం తన సమర్థన ను వ్యక్తం చేసింది అని ప్రధాన మంత్రి తెలియజేశారు. చర్చ లు మరియు దౌత్యం లు మన ముందు ఉన్నటువంటి మార్గం అని భారతదేశం పిలుపు ను ఇస్తోందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
ప్రస్తుతం జి20 కి భారతదేశం యొక్క అధ్యక్షత న చేపట్టే వివిధ కార్యక్రమాల కు ప్రెసిడెంటు శ్రీ రామాఫోసా తన పూర్తి మర్థన ను వ్యక్తం చేశారు. భారతదేశాన్ని సందర్శించడం కోసం తాను ఉత్సాహపడుతున్నట్లు ఆయన తెలియ జేశారు.
నేతలు ఇరువురు పరస్పరం సంప్రదింపులు జరుపుకోవడాన్ని కొనసాగించే విషయం లో వారి సమ్మతి ని వ్యక్తం చేశారు.
**
(Release ID: 1931688)
Visitor Counter : 135
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam