ప్రధాన మంత్రి కార్యాలయం

హెలికాప్టర్ల కోసం పనితీరు-ఆధారిత నావిగేషన్‌పై ఆసియాలో తొలి ప్రదర్శనకు ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 02 JUN 2023 8:32PM by PIB Hyderabad

   హెలికాప్టర్ల కోసం పనితీరు ఆధారిత నావిగేషన్‌ దిశగా ‘గగన్‌’ ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో జుహూ నుంచి పుణె ప్రయాణం ద్వారా ఆసియాలో తొలి ప్రదర్శన నిర్వహించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

దీనిపై కేంద్ర పౌర విమానయాన-ఉక్కు శాఖల మంత్రి ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:

“ఈ రంగంలో ఇదొక గుర్తించదగిన మైలురాయి! సురక్షిత, మరింత సమర్థ గగనతల రాకపోకల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతల అనుసరణలో మా నిబద్ధతకు ఇదొక నిదర్శనం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1929719) Visitor Counter : 151