ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గోవా లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు జూన్ 3 వ తేదీ నప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టనున్న ప్రధాన మంత్రి


ఇది దేశంలో 19 వ వందే భారత్ రైలు కానుంది

ఈ వందే భారత్ ముంబయి మరియు గోవా ల మధ్య యాత్ర ను దాదాపు గా ఏడున్నర గంటల లో పూర్తి చేస్తుంది; ఈ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు తో పోలిస్తే వందే భారత్ రైలు యాత్ర లో సుమారు ఒక గంట కాలం ఆదా అవుతుంది

ఈ రైలు ప్రయాణికుల కు ప్రపంచ శ్రేణి అనుభవాన్ని అందించడం తోపాటు గా పర్యటన కు ఊతాన్ని అందిస్తుంది

Posted On: 02 JUN 2023 1:27PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోవా లో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు జూన్ 3వ తేదీ న ఉదయం పదిన్నర గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభసూచకంగా ఆకుపచ్చటి జెండా ను చూపెట్టి ఆ రైలు ను బయలుదేరదీయనున్నారు.

‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ఆత్మనిర్భర్ భారత్ ల తాలూకు ప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణం గా, అధునాతనమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ముంబయి- గోవా మార్గం లో సంధానాన్ని మెరుగుపరచనుంది; ఆ ప్రాంత ప్రజల కు వేగవంతమైనటువంటి మరియు సౌకర్యవంతమైనటువంటి ప్రయాణ మాధ్యాన్ని ఈ రైలు అందించనుంది. ఈ రైలు దేశం లో నడిచేటటువంటి 19వ వందే భారత్ రైలు కానున్నది.

ఈ రైలు ముంబయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ మరియు గోవా లోని మడ్ గాఁవ్ స్టేశనుల మధ్య నడుస్తుంది. ఇది యాత్ర ను ఇంచుమించు ఏడున్నర గంటల లో పూర్తి చేస్తుంది. దీనితో ఈ రెండు స్థానాల మధ్య ప్రస్తుతం అత్యంత వేగం గా నడుస్తున్న రైలు తో పోలిస్తే సుమారు ఒక గంట యాత్రా కాలం ఆదా అవుతుంది.

దేశీయం గా తయారు చేసిన ఈ రైలు కు ప్రపంచ శ్రేణి సౌకర్యాలను మరియు కవచ్ సాంకేతికత సహా అత్యాధునిక భద్రత సాధనాల ను జతపరచడమైంది. ఈ రైలు రెండు రాష్ట్రాల లో పర్యటన ను ప్రోత్సహిస్తుంది.

 

 

***


(Release ID: 1929435) Visitor Counter : 191