ప్రధాన మంత్రి కార్యాలయం

అసమ్ యొక్క  తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మే నెల 29 వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


ఈ వందే భారత్ గువాహాటీ నుండి న్యూ జల్ పాయిగుడి వరకుసాగే యాత్ర ను అయిదున్నర గంటల లో పూర్తి చేస్తుంది; కాగా, వర్తమానం లో అన్నొంటి కంటే వేగం గా సాగిపోయే రైలు బండి ఈ యాత్ర కు గాను ఆరుగంటల ముప్ఫై నిమిషాల సేపు తీసుకొంటుంది.

క్రొత్త గా విద్యుదీకరణ జరిగిన భాగాల ను ప్రధానమంత్రి దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు గా నూతనం గా నిర్మాణం జరిగిన డిఇఎమ్ యు/ఎమ్ఇఎమ్ యుషెడ్డు ను సైతం  ప్రారంభిస్తారు 

Posted On: 28 MAY 2023 5:35PM by PIB Hyderabad

అసమ్ లోని ఒకటో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే నెల 29 వ తేదీ నాడు మధ్యాహ్నం 12 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభ సూచక పచ్చజెండా ను చూపెట్టి రైలు ను బయలుదేర దీస్తారు.

 

 

అత్యాధునికమైనటువంటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు, ఆ ప్రాంత ప్రజల కు ప్రయాణ వేగవంతమైనటువంటి మరియు హాయి గా ఉండేటటువంటి ప్రయణాన్ని చేసే సౌకర్యాన్ని అందించనుంది. దీనితో ఆ ప్రాంతం లో పర్యటన కు కూడా ప్రోత్సాహం లభించగలదు. గువాహాటీ ని న్యూ జల్ పాయిగుడీ తో కలిపేటటువంటి ఈ రైలు బండి ఈ రెండు స్థానాలను సంధానించే వర్తమానం లో అన్నిటి కన్నా వేగం గా నడిచే రూతు తో పోల్చి చూస్తే గనక యాత్రా కాలం లో దాదాపు గా ఒక గంట సమయాన్ని ఆదా చేయగలగుతుంది. వందే భారత్ రైలు అయిదు గంటల ముప్ఫై నిమిషాల లో ఈ యాత్ర ను పూర్తి చేస్తుంది; కాగా వర్తమానం లో అన్నింటి కంటే వేగవంతం అయిన రైలు బండి ఇదే యాత్ర ను పూర్తి చేయడాని కి ఆరు గంటల ముప్ఫై నిమిషాల సమయాన్ని తీసుకొంటోంది.

 

 

క్రొత్త గా విద్యుదీకరణ జరిగినటువంటి ప్రధాన మంత్రి 182 రూట్ కిలో మీటర్ ల మేర నూతనం గా విద్యుతీకరణ జరిగిన రైలు సెక్శన్ లను కూడా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. వీటితో రైళ్లను అధిక వేగం తో నడిపించే మరియు రైళ్ళ యాత్ర కాలం లో తగ్గింపు ను తీసుకు రావడం .. ఇవే కాకుండా కాలుష్యాని కి తావు ఉండని విధం గా రవాణా సంబంధి సౌకర్యాన్ని అందించడం లో సాయం లభించనుంది. వీటి తో ఇలెక్ట్రిక్ లైన్ పైన నడచేటటువంటి రైళ్లు సైతం మేఘాల యలో ప్రవేశించగలుగుతాయి.

 

 

అసమ్ లోని లుమ్ డింగ్ లో క్రొత్త గా నిర్మించిన డిఇఎమ్ యు/ఎమ్ఇఎమ్ యు షెడ్డు ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ క్రొత్త సదుపాయం ఆ ప్రాంతం లో నడుస్తున్న డిఇఎమ్ యు రేక్స్ నిర్వహణ లో సహాయకారి గా ఉంటుంది. ఫలింతం గా మెరుగైన నిర్వహణ సామర్థ్యం ప్రాప్తించనుంది.

 

 

***



(Release ID: 1928088) Visitor Counter : 141