ప్రధాన మంత్రి కార్యాలయం
రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
Posted On:
20 MAY 2023 12:06PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే 20 వ తేదీన , హిరోషిమాలో జరుగుతున్న జి–7 శిఖరాగ్ర సమావేశాల సందర్బంగా , రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్తో సమావేశమయ్యారు.
ఈ సందర్బ:గా ఇరువురు నాయకులు, ఇండియా– రిపబ్లిక్ ఆఫ్ కొరియాల మధ్య ప్రత్యేక వ్యూహత్మక భాగస్వామ్యం గురించి చర్చించారు. అలాగే ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, ప్రత్యేకించి ట్రేడ్,ఇన్వెస్ట్మెంట్, ఉన్నతస్థాయి సాంకేతిక పరిజ్ఞానానికి ఐటి హార్డ్వేర్ తయారీ, రక్షణ, సెమీకండక్టర్లు, సంస్కృతికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సంవత్సరం ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని, ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఉభయులూ నిర్ణయించారు. కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్, జి–20కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తుండడాన్ని అభినందించారు. తమ మద్దతును ఆయన తెలియజేశారు.
ఈ ఏడాది సెప్టెంబర్లో ఇండియాలో జరగనున్న జి20 నాయకుల సమావేశాలకు అధ్యక్షుడు యూన్ ఇండియా వచ్చినపుడు వారిని తిరిగి కలుసుకోగలమన్న ఆకాంక్షను ప్రధానమంత్రి వ్యక్తం చేశారు. కోరియా పాటిస్తున్న ఇండో–పసిఫిక్ వ్యూహాన్ని అందులో ఇండియాకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రధానమంత్రి స్వాగతించారు.
ఇరువురు నాయకులు ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
***
(Release ID: 1926203)
Visitor Counter : 130
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam