ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిక్కిం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 16 MAY 2023 5:25PM by PIB Hyderabad

   సిక్కిం రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సిక్కిం రాష్ట్ర ప్రగతి పయనం నిరంతరం కొనసాగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“సిక్కింలోని నా సోదరసోదరీమణులకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అసాధారణ ప్రకృతి సోయగం, శ్రమైక జీవన సౌందర్యం మేళవించిన అద్భుతమైన రాష్ట్రమిది. ఈ రాష్ట్రం వివిధ రంగాల్లో... ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంలో అపార ప్రగతి సాధించింది. ఇకమీదట కూడా సిక్కిం నిరంతరం అభివృద్ధి పథంలో పయనించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

****

DS/ST


(रिलीज़ आईडी: 1924605) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam