ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలోనిజాతీయ ఆధునిక చిత్రకళా ప్రదర్శన శాలలోజనశక్తి చిత్రకళా ప్రదర్శననుతిలకించిన ప్రధానమంత్రి
ప్రదర్శన ముఖ్యాంశాలను ప్రజలతోపంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
14 MAY 2023 2:41PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని జాతీయ ఆధునిక చిత్రకళా ప్రదర్శనశాలలో ఏర్పాటు చేసిన జనశక్తి చిత్రకళా ప్రదర్శనను తిలకించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం సంబంధిత కొన్ని ఇతివృత్తాల ఆధారంగా చిత్రించిన అద్భుత కళాఖండాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
దీనిపై ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్’లో జనశక్తి చిత్రకళా ప్రదర్శనను తిలకించాను. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోని కొన్ని ఇతివృత్తాల ఆధారంగా అద్భుతంగా చిత్రించిన కళాఖండాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. తమ సృజనాత్మకతతో ఈ ప్రదర్శనను సుసంపన్నం చేసిన కళాకారులందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అలాగే- “ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్’లో నిర్వహించిన జనశక్తి చిత్రకళా ప్రదర్శనలోని కొన్ని కళాఖండాల విశేషాలను మీతో పంచుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
For more details: https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1924012
***
DS/TS
(Release ID: 1924116)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam