మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
“పోషన్ భీ, పధై భీ”, మిషన్ సక్షం అంగన్‌వాడీ, పోషణ్ 2.0 కింద ప్రారంభ బాల్య సంరక్షణ, విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ; ఎన్ఈపి కింద గుర్తించిన కీలక అభివృద్ధి పరిథిలలో నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించి, 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న శ్రీమతి ఇరానీ
డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం సుమారు 7 కోట్ల మంది పిల్లల ఎత్తు, బరువును కొలిచి, పోషన్ ట్రాకర్ ఐసిటి ప్లాట్‌ఫారమ్‌లో సమాచారాన్ని అప్‌లోడ్ చేసిన అంగన్‌వాడీ కార్యకర్తల నిబద్ధతను గుర్తించి, అభినందించారు; ప్రపంచంలోనే అసమానమైన ఘనతను కొనియాడారు
ప్రాథమిక అభివృద్ధిలో టిఎల్ఎం వలె బొమ్మల పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు
ఈసిసిఈ మెటీరియల్, ఆడియో-విజువల్ మెటీరియల్ 1 లక్ష కార్యకలాపాల ద్వారా 10,000 కమ్యూనిటీలలో 1.5 మిలియన్ల తల్లిదండ్రులతో పరీక్షించారు
ఈసిసిఈ శిక్షణ, బోధనా అభ్యాస సామగ్రి కోసం ప్రతిపాదించిన మెరుగైన బడ్జెట్‌తో ప్రకటించిన ఎన్ఐపిసిసిడి నేతృత్వంలోని ఆట-ఆధారిత బోధనా విధానంతో మూడు రోజుల ప్రత్యేక ఈసిసిఈ శిక్షణ ద్వారా 1.3 మిలియన్లకు పైగా అంగన్‌వాడీ కార్యకర్తలకు అదనపు మద్దతు
Posted On:
12 MAY 2023 10:04AM by PIB Hyderabad
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి (డబ్ల్యూసిడి) శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, మే 10న విజ్ఞాన్ భవన్‌లో ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసిసిఈ)ని బలోపేతం చేయడంపై ఏర్పాటు చేసిన జాతీయ కార్యక్రమంలో “పోషణ్ భీ, పధై భీ”ని ప్రారంభించారు. రాష్ట్ర ఎండబ్ల్యూసిడి మంత్రి శ్రీ ముంజ్‌పరా మహేంద్రభాయ్, ; కార్యదర్శి (డబ్ల్యూసిడి) శ్రీ ఇండెవర్ పాండే, మంత్రిత్వ శాఖ ఈసిసిఈ టాస్క్ ఫోర్స్ చైర్‌పర్సన్ శ్రీ సంజయ్ కౌల్ కూడా పాల్గొన్నారు.
800 మందికి పైగా రాష్ట్ర ప్రజాప్రతినిధులు, ఐసిడిఎస్ కార్యకర్తలు, సిడిపిఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ కీలకోపన్యాసం చేశారు. జాతీయ విద్యా విధానం 2020 (ఎన్ఈపి) ప్రకారం భౌతిక/మోటారు, అభిజ్ఞా, సామాజిక అంశాలలో గుర్తించబడిన కీలక అభివృద్ధి డొమైన్‌లలో వారి నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించి, 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిబద్ధతను ఆమె ప్రస్తావించారు.
కొత్త టీచింగ్ మెటీరియల్ (టిఎల్ఎం), మెథడాలజీల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఒక లక్ష కార్యకలాపాల ద్వారా 10,000 కమ్యూనిటీలలో 1.5 మిలియన్ల తల్లిదండ్రులతో ఈసిసిఈ మెటీరియల్, ఆడియో-విజువల్ మెటీరియల్‌లను పరీక్షించినట్లు చెప్పారు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల్లోని సంబంధిత విభాగాల సహకారంతో సమగ్ర బోధనా అభ్యాస సామగ్రిని అభివృద్ధి చేయడం ప్రాముఖ్యతను కూడా ఆమె నొక్కిచెప్పారు, తద్వారా దివ్యాంగుల పిల్లలకు ఈసిసిఈలో పద్ధతులు అభివృద్ధి జరుగుతాయి.
రాష్ట్ర మంత్రి శ్రీ ముంజ్‌పరా మహేంద్రభాయ్, పోషన్‌ను ఇంటి పేరుగా మార్చడంలో భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తించారు. "అంతా కలిసి, మన వ్యవస్థలను, మన ఆలోచనలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాము - స్వచ్ఛ భారత్‌లోని ప్రాథమిక పరిశుభ్రత నుండి, పోషణ్ అభియాన్‌లో మంచి పోషకాహార పద్ధతులకు, ఇప్పుడు "పోషన్ భీ, పధై భీ అమలు చేస్తున్నాము" అని అన్నారు.
(Release ID: 1923946)
Visitor Counter : 228