ప్రధాన మంత్రి కార్యాలయం
దోహా డైమండ్ లీగ్ క్రీడల ‘జావెలిన్ త్రో’ విజేత నీరజ్ చోప్రాకు ప్రధాని అభినందనలు
प्रविष्टि तिथि:
06 MAY 2023 10:57AM by PIB Hyderabad
దోహా డైమండ్ లీగ్ క్రీడల ‘జావెలిన్ త్రో’ క్రీడలో భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా ప్రథమ స్థానంలో నిలవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఈ ఏడాది తొలి అంతర్జాతీయ క్రీడా పోటీ… అందులో ప్రథమ స్థానం! అద్భుతం” అని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ మేరకు “ఈ క్రీడల్లో 88.67 మీటర్ల దూరం జావెలిన్ విసిరి, ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడం ద్వారా దోహా డైమండ్ లీగ్ క్రీడల్లో మన నీరజ్ చోప్రా మెరిశారు. ఆయనకు నా అభినందనలు.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
****
DS
(रिलीज़ आईडी: 1922279)
आगंतुक पटल : 274
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam