ప్రధాన మంత్రి కార్యాలయం
తిరువనంతపురం-కాసర్ గోడ్ మధ్య కేరళ మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను కేరళ లోని తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
Posted On:
25 APR 2023 2:16PM by PIB Hyderabad
తిరువనంతపురం-కాసర్‌గోడ్ మధ్య కేరళ లోని మొట్టమొదటి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ రోజు తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పచ్చజెండా చూపి ప్రారంభించారు. ప్రధాన మంత్రి వేదిక వద్దకు చేరుకుని తిరువనంతపురం-కాసర్ గోడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను పరిశీలించారు; అనంతరం చిన్నారుల తో రైలు సిబ్బంది తో సంభాషించారు.
ఈ రైలు కేరళ లోని 11 జిల్లాలు, తిరువనంతపురం, కొల్లమ్, కొట్టాయమ్, ఎర్నాకులమ్, త్రిశూర్, పాలక్కాడ్, పథనమ్ తిట్ట, మలప్పురం, కోఝికోడ్, కన్నూర్, కాసర్ గోడ్ లను కలుపుతుంది.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘తిరువనంతపురం నుండి కాసర గోడ్ వరకు అనుసంధానాన్ని మెరుగు పరిచే కేరళ మొట్ట మొదటి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించడం జరిగింది’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1919479)
Visitor Counter : 208
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam