ప్రధాన మంత్రి కార్యాలయం
మద్రాస్ ఐఐటి లో ఓడ రేవులు, జల మార్గాలు, కోస్తా ప్రాంతాలకోసం జాతీయ సాంకేతిక కేంద్రం ప్రారంభాన్ని స్వాగతించిన ప్రధాన మంత్రి
Posted On:
25 APR 2023 9:24AM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మద్రాస్ ఐఐటి డిస్కవరీ కేంపస్ లో ఓడ రేవులు, జలమార్గాలు, కోస్తా ప్రాంతాల కోసం జాతీయ సాంకేతిక కేంద్రం (ఎన్ టిసిపిడబ్ల్యుసి) ను ప్రారంభించారు.
ఎన్ టిసిపిడబ్ల్యుసి ని ప్రతిష్టాత్మక సాగరమాల కార్యక్రమం కింద 77 కోట్ల రూపాయాల వ్యయం తో ప్రారంభించారు. ఈ రోల్ మోడల్ సెంటర్ స్థానిక, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో శాస్త్రపరమైన మద్దతు, విద్య, అనువర్తిత పరిశోధన, సాంకేతికత బదిలీ ద్వారా సముద్ర రంగం లో సవాళ్ల కు పరిష్కారాల ను అందిస్తుంది.
ప్రధాన మంత్రి సమాధానమిస్తూ,
‘‘@iitmadras లో గల ఎన్ టిసిపిడబ్ల్యుసి భారతదేశ సముద్ర రంగ వృద్ధి ని బలోపేతం చేస్తుంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1919209
***
DS
(Release ID: 1919422)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam