హోం మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లో చరిత్రాత్మక నిర్ణయం; కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షలు హిందీ, ఇంగ్లిష్ తోబాటు 13 ప్రాంతీయ భాషలలో రాసేందుకు హోమ్ మంత్రిత్వ శాఖ ఆమోదం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో చరిత్రాత్మక నిర్ణయం; కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షలు హిందీ, ఇంగ్లిష్ తోబాటు 13 ప్రాంతీయ భాషలలో రాసేందుకు హోమ్ మంత్రిత్వ శాఖ ఆమోదం

ప్రశ్నపత్రంహిందీ, ఇంగ్లీష్ భాషలకు తోడుగా అసమియా, బంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళమ్, కన్నడ, తమిళ, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురీ, కొంకణీ భాషల లో రూపకల్పన

ఈ నిర్ణయంతో లక్షలాది మంది పరీక్ష ను వారి మాతృభాష లో లేదా వారి ప్రాంతీయ భాష లో రాయగలుగుతారు; తద్వారా వారి ఎంపిక కు అవకాశాలు పెరుగుతాయి

దేశవ్యాప్తంగా లక్షలాదిమందిని ఆకర్షిస్తూ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే ప్రధానపరీక్షలలో కానిస్టేబుల్ జీడీ ఒకటి

2024 జనవరి 1 నుంచి హిందీ, ఇంగ్లిష్ తో బాటు 13 ప్రాంతీయ భాషలలో ఈ పరీక్ష

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లో కేంద్ర హోమ్, సహకార శాఖా మంత్రి శ్రీ అమిత్ శాహ్ మార్గదర్శకత్వం లో ప్రాంతీయ భాష లఅభివృద్ధి కి, ప్రోత్సాహాని కి కట్టుబడిన ప్రభుత్వం

Posted On: 15 APR 2023 11:44AM by PIB Hyderabad

సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (సి పి ఎఫ్) లో స్థానిక యువత పాల్గొనేందుకు, ప్రాంతీయ భాషల ను ప్రోత్సహించేందుకు కేంద్ర హోమ్, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ శాహ్ చొరవ తో మహత్తరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రశ్నపత్రాన్ని హిందీ, ఇంగ్లీష్ భాషల కు తోడు గా అసమియా, బంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళ, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురీ మరియు కొంకణీ భాషల లో రూపొందిస్తారు.

 

నిర్ణయం వలన పరీక్షలో పాల్గొనే లక్షలాది మంది తమ మాతృభాష/ప్రాంతీయ భాషలో రాసే అవకాశం రావటం, తద్వారా వారు ఎంపికయ్యే అవకాశం మెరుగుపడటం జరుగుతాయి. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ని ఆకర్షిస్తూ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే ప్రధాన పరీక్షల లో కానిస్టేబుల్ జీడీ ఒకటి.

2024 జనవరి 1 నుంచి హిందీ, ఇంగ్లిష్ తో బాటు 13 ప్రాంతీయ భాషల లో పరీక్ష జరుగుతుంది.

 

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం లో కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్ మార్గదర్శకత్వం లో ప్రాంతీయ భాష ల అభివృద్ధి కి, ప్రోత్సాహాని కి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం వల్ల కేంద్ర సాయుధ పోలీసు దళాల కోసం జరిగే కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షల ను హిందీ, ఇంగ్లిష్ భాషల లో గాని లేదా 13 ప్రాంతీయ భాషల లో గాని రాసేందుకు హోమ్ మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ తో పాటు కింద ప్రస్తావించినటువంటి ప్రాంతీయ భాషల లోనూ ఉంటుంది.

1. అసమియా,

2. బంగాలీ,

3. గుజరాతీ,

4. మరాఠీ,

5. మలయాళమ్,

6. కన్నడ,

7. తమిళ,

8. తెలుగు,

9. ఒడియా,

10. ఉర్దూ,

11. పంజాబీ,

12. మణిపురీ మరియు

13. కొంకణి.

 

నిర్ణయం వలన పరీక్షలో పాల్గొనే లక్షలాది అభ్యర్థులు వారి మాతృభాష లో గాని లేదా ప్రాంతీయ భాష లో గాని పరీక్ష ను రాసే అవకాశం లభించడం, తద్వారా వారు ఎంపిక అయ్యే అవకాశం మెరుగు పడడం జరుగుతాయి.

బహుళ భారతీయ భాషల లో పరీక్ష లు జరపటానికి అవకాశాన్ని కల్పిస్తూ ప్రస్తుత అవగాహనః ఒప్పందానికి అనుబంధంగా మరో ఒప్పందం మీద హోమ్ మంత్రిత్వ శాఖ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సంతకాలు చేస్తాయి. దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని ఆకర్షిస్తూ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే ప్రధాన పరీక్షలలో కానిస్టేబుల్ జీడీ ఒకటి. 2024 జనవరి 1 వ తేదీ నుండి హిందీ, ఇంగ్లిష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల లో పరీక్ష జరుగుతుంది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విస్తృత ప్రచారం కల్పించటం ద్వారా యువత అవకాశాన్ని వాడుకొని మాతృభాష లో పరీక్షల ను రాసేటట్టు గా ప్రోత్సహించాలని, దేశ సేవ లో ఉండే కెరీర్ ఎంచుకోవడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకొంటోంది.

 

 

***

 

 



(Release ID: 1916811) Visitor Counter : 179