ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్-19 నిర్వహణకు ప్రజారోగ్య సంసిద్ధత, కోవిడ్-19 వ్యాక్సినేషన్ పురోగతి పై రాష్ట్రాలతో సమీక్షించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో మాదిరిగానే సహకార స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉంది: డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

‘టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ , కోవిడ్ సముచిత ప్రవర్తనకు కట్టుబడి ఉండటం అనే ఐదు అంచెల వ్యూహం కోవిడ్ నిర్వహణకు ప్రభుత్వ విధానంగా కొనసాగుతోంది‘

ఏప్రిల్ 8, 9 తేదీల్లో జిల్లా యంత్రాంగం, ప్రజారోగ్య అధికారులతో సన్నద్ధతను సమీక్షించాలని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు ఆదేశం

ఏప్రిల్ 10, 11 తేదీల్లో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు సలహా; ఆస్పత్రులను సందర్శించి మాక్ డ్రిల్స్ ను సమీక్షించాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రులకు విజ్ఞప్తి

అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్-19 నిర్వహణకు అన్ని రకాల సన్నద్ధత పాటించాలని రాష్ట్రాలకు సూచన

ఎమర్జెన్సీ హాట్ స్పాట్ లను గుర్తించాలని రాష్ట్రాలకు సూచన; టెస్టింగ్, వ్యాక్సినేషన్ ఆసుపత్రి మౌలిక సదుపాయాల సంసిద్ధతను పెంచాలని సలహా

Posted On: 07 APR 2023 2:47PM by PIB Hyderabad

"కోవిడ్-19 నివారణ , నిర్వహణ కోసం మునుపటి వేవ్ ల సమయంలో మాదిరిగానే కేంద్రం , రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో పనిచేయడం కొనసాగించాలి" అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు/ అడిషనల్ చీఫ్ సెక్రటరీలతో ఆయన ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని వర్చువల్ గా సమీక్షించారు. కొవిడ్-19 కట్టడి, నిర్వహణకు ప్రజారోగ్య సన్నద్ధత, కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల కేసులు పెరుగుతున్న దృష్ట్యా జాతీయ కొవిడ్-19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ పురోగతిని సమీక్షించేందుకు ఈ వర్చువల్ సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్  కూడా పాల్గొన్నారు.

 

రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్-19 నిర్వహణకు అన్ని రకాల సన్నద్ధతతో ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి సూచించారు. 2023 ఏప్రిల్ 10, 11 తేదీల్లో అన్ని ఆసుపత్రుల లో మౌలిక సదుపాయాల మాక్ డ్రిల్స్ నిర్వహించాలని, 2023 ఏప్రిల్ 8, 9 తేదీల్లో జిల్లా యంత్రాంగాలు, ఆరోగ్య అధికారులతో ఆరోగ్య సన్నద్ధతను సమీక్షించాలని ఆయన రాష్ట్ర ఆరోగ్య మంత్రులను కోరారు. ఐఎల్ఐ/ఎస్ఏఆర్ఐ కేసుల ధోరణులను పర్యవేక్షించడం ద్వారా అభివృద్ధి చెందుతున్న హాట్ స్పాట్ లను గుర్తించాలని, కోవిడ్-19, ఇన్ ఫ్లూయెంజా పరీక్షల కోసం తగిన నమూనాలను పంపాలని ఆయన రాష్ట్రాలను కోరారు. పాజిటివ్ నమూనాల మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ ను పెంచాలన్నారు.

 

23 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి మిలియన్ కు సగటు పరీక్షలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నాయని గుర్తించారు. కొత్త కోవిడ్ వేరియంట్లతో సంబంధం లేకుండా, 'టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సిన్ ,  కోవిడ్ సముచిత ప్రవర్తనకు కట్టుబడి ఉండటం' అనే ఐదు అంచెల వ్యూహం కోవిడ్ నిర్వహణకు పరీక్షించిన వ్యూహంగా కొనసాగుతోందని డాక్టర్ మాండవీయ అన్నారు. తద్వారా తగిన ప్రజారోగ్య చర్యలు చేపట్టేందుకు వీలవుతుందని తెలిపారు. 2023 ఏప్రిల్ 7తో ముగిసే వారానికి ప్రతి మిలియన్ కు 100 టెస్టుల రేటును వేగంగా పెంచాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. టెస్టుల్లో ఆర్టీపీసీఆర్ వాటాను పెంచాలని సూచించారు.

 

భారతదేశం కోవిడ్ -19 కేసులలో స్థిరమైన పెరుగుదలను చూస్తోందని, 2023 మార్చి 17 తో ముగిసిన వారంలో సగటు రోజువారీ కేసులు 4,188 కు పెరిగాయని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు వివరించారు. 07 ఏప్రిల్, 2023 తో ముగిసిన వారంలో వీక్లీ పాజిటివిటీ 3.02% వరకు ఉంది.

అయితే, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 88,503 రోజువారీ సగటు కేసులు నమోదయ్యాయి, గత వారం రోజుల్లో ప్రపంచ కేసులలో టాప్ 5 దేశాలు 62.6% వాటాను కలిగి ఉన్నాయి.

 

ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ ఒక వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (వి ఒ ఐ), ఎక్స్ బి బి 1.5, మరో ఆరు (బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్.1.1, ఎక్స్బీబీ, ఎక్స్బీఎఫ్, ఎక్స్బీబీ.1.16) వేరియంట్లను నిశితంగా పరిశీలిస్తోందని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేశారు. ఒమిక్రాన్ దాని ఉప రకాలు ప్రధాన వేరియంట్ గా కొనసాగుతున్నప్పటికీ, పరిశీలించిన వేరియంట్లలో చాలా వరకు గణనీయమైన వ్యాప్తి, వ్యాధి తీవ్రత లేదా రోగనిరోధకత

ను తప్పించుకునే లక్షణాలు చాలా తక్కువ గా లేదా అసలు లేనివిగా ఉండడం గమనార్హం. ఎక్స్ బి బి.1.16 ప్రాబల్యం ఫిబ్రవరిలో 21.6% నుండి 2023 మార్చిలో 35.8% కి పెరిగింది. అయినప్పటికీ, ఆసుపత్రిలో చేరికలు, లేదా మరణాల పెరుగుదలకు కారణమైనట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు.

 

ప్రాధమిక వ్యాక్సినేషన్ లో భారత్ 90 శాతానికి పైగా కవరేజీని సాధించినప్పటికీ, ప్రికాషన్ డోస్ కవరేజీ చాలా తక్కువగా ఉందని తెలియజేశారు. అర్హత కలిగిన ప్రజలందరికీ, ముఖ్యంగా వృద్ధులు, దుర్బల జనాభా సమూహానికి వ్యాక్సినేషన్ పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు.

 

భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలు అధిక సంఖ్యలో కోవిడ్ కేసులను నివేదించాయని, కేరళ, మహారాష్ట్ర,

 ఢిల్లీలో 10 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలు 10% కంటే ఎక్కువ పాజిటివిటీని నివేదించాయని, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు , హర్యానా రాష్ట్రాల్లో 5% కంటే ఎక్కువ పాజిటివిటీని నివేదించిన 5 జిల్లాలు ఉన్నాయని గుర్తించారు.  కోవిడ్ సముచిత ప్రవర్తనకు కట్టుబడి ఉండటం గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలను పెంచవలసిన ప్రాముఖ్యతను డాక్టర్ మాండవీయ నొక్కి చెప్పారు. అన్ని లాజిస్టిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ల సన్నద్ధతను స్వయంగా పర్యవేక్షించాలని, తగినన్ని ఆసుపత్రుల్లో పడకల లభ్యత, అవసరమైన మందుల నిల్వలు ఉండేలా చూడాలని ఆయన అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులను కోరారు. కోవిడ్ ఇండియా పోర్టల్ లో రాష్ట్రాలు తమ కోవిడ్ డేటాను క్రమం తప్పకుండా అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు.

 

ప్రపంచ , దేశీయ కొవిడ్-19 పరిస్థితులపై రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు వివరించారు. కొత్త సార్స్-కోవ్-2 వేరియంట్ల వ్యాప్తిని గుర్తించడానికి , నియంత్రించడానికి అనుమానిత, ధృవీకరించబడిన కేసులను ముందస్తుగా గుర్తించడం, ఐసోలేషన్, పరీక్షలు సకాలంలో నిర్వహించడం ద్వారా సీజనల్ ఇన్ ఫ్లూయేంజ , కోవిడ్ -19 కేసుల పెరుగుదలను నియంత్రించడానికి పునరుద్ధరించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ,ఐసిఎంఆర్ 2023 మార్చి 25 న అన్ని రాష్ట్రాలకు జారీ చేసిన సంయుక్త సలహా గురించి ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిని సమర్థవంతంగా అమలు చేసేలా చూడాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య మంత్రి కోరారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, టెస్టు లను పెంచడం సహా కొవిడ్ నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు.

 

సకాలంలో కోవిడ్-19 సంసిద్ధత,  నిర్వహణ ఆవశ్యకత ను డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ నొక్కి చెప్పారు. ప్రాధాన్య క్రమంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి ఇ సి ఆర్ పి II లో రాష్ట్రాలు తమ భాగాన్ని అమలు చేయాలని ఆమె కోరారు. పర్యాటకం పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రాలు తమ పర్యవేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని, అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.

 

కేంద్ర ఆరోగ్య మంత్రి అధ్యక్షతన సకాలంలో సమీక్షా సమావేశాలనిర్వహణను, , కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలను రాష్ట్రాలు అభినందించాయి. కొవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చాయి. తాము అప్రమత్తంగా ఉన్నామని, ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తున్నామని  తెలియజేశాయి. 2023 ఏప్రిల్ 10, 11 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాల్లో ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంసిద్ధత కోసం మాక్ డ్రిల్ నిర్వహిస్తామని రాష్ట్రాలు హామీ ఇచ్చాయి.

 

పుదుచ్చేరి ముఖ్యమంత్రి శ్రీ ఎన్ రంగస్వామి, ఉత్తరాఖండ్ ఆరోగ్య మంత్రి , శ్రీ ధన్ సింగ్ రావత్ , శ్రీ కేశబ్ మహంత, అస్సాం ఆరోగ్య మంత్రి  శ్రీ కేశబ్ మహంత,  గోవా ఆరోగ్య మంత్రి శ్రీ విశ్వజిత్ రాణే, జార్ఖండ్ ఆరోగ్య మంత్రి  శ్రీ బన్నా గుప్తా, మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి శ్రీ ప్రభురామ్ చౌదరి, పంజాబ్ ఆరోగ్య మంత్రి  బల్బీర్ సింగ్,  మణిపూర్ ఆరోగ్య మంత్రిడాక్టర్ సపన్ రంజన్ సింగ్, హర్యానా ఆరోగ్య మంత్రి శ్రీ అనిల్ విజ్, తమిళనాడు ఆరోగ్య మంత్రి  శ్రీ తిరు మా సుబ్రమణియన్, హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ (కల్నల్) ధని రామ్ శాండిల్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి  శ్రీమతి విడదల రజిని, తెలంగాణ ఆరోగ్య మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు, గుజరాత్ ఆరోగ్య మంత్రి శ్రీ రుషికేష్ పటేల్, ఒరిస్సా ఆరోగ్య మంత్రి శ్రీ నిరంజన్ పూజారి, అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్య మంత్రి  శ్రీ అలో లిబాంగ్, మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి శ్రీ తానాజీ సావంత్.  మేఘాలయ ఆరోగ్య మంత్రి  శ్రీమతి మజెల్ అంబరీన్ లింగ్డో, ఢిల్లీ ఆరోగ్య మంత్రి శ్రీ సౌరభ్ భరద్వాజ్, ఇంకా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

****




(Release ID: 1914759) Visitor Counter : 191