ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నేపథ్యంలో ఆరోగ్యకర భూగోళం కోసం కృషి చేస్తున్నవారికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు

प्रविष्टि तिथि: 07 APR 2023 11:21AM by PIB Hyderabad

   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన భూగోళాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ట్వీట్‌ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:

“మన భూగోళాన్ని ఆరోగ్యకరంగా మార్చేందుకు కృషి చేస్తున్నవారందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మా కృతజ్ఞతలు. ఇందులో భాగంగా ఆరోగ్య మౌలిక సదుపాయాల పెంపుతోపాటు ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడానికి మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1914671) आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam