మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈ ఏడాది హజ్ యాత్రలో ఒంటరిగా పెద్ద సంఖ్యలో వెళ్లేందుకు మహిళలకు అనుమతి


యాత్రీకులు బయలుదేరే అన్ని ప్రాంతాల్లో ఫారెక్స్ కార్డు జారీ తో సహా హజ్ యాత్రికుల కోసం విదేశీ మారక ద్రవ్యం సమకూర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యాత్రికుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ సేవలు అందుబాటులోకి తేనున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Posted On: 03 APR 2023 4:44PM by PIB Hyderabad

హజ్ యాత్రకు వెళ్లే భారతీయుల కోసం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, అవరోధాలు లేకుండా యాత్ర పూర్తి చేయడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  అనేక కార్యక్రమాలు చేపట్టింది. యాత్రికుల ఎంపిక పారదర్శకంగా, సమర్ధంగా, నిర్ణీత గడువులోగా మానవ ప్రమేయం లేకుండా జరిగేలా చూసేందుకు కృషి జరుగుతుంది.

 హజ్ కోసం దరఖాస్తులు,యాత్రికుల ఎంపిక ఆన్‌లైన్‌లో జరిగింది. అందిన మొత్తం 1.84 లక్షల దరఖాస్తులు అందాయి. 14,935 మంది హజ్ దరఖాస్తుదారులకు కేటాయింపు హామీ ఇవ్వడం జరిగింది.  (70+ వయస్సు కేటగిరీలో 10,621 మందికి  మెహ్రామ్ లేని 4,314 మంది మహిళలు (LWM) ఉన్నారు. పురుష  సభ్యుడు లేకుండా ఒంటరిగా హజ్‌కు వెళ్లే మహిళలలో ఇది అతిపెద్ద బృందం.

హజ్ కోటాకి మించి అందిన దరఖాస్తులను మానవ ప్రమేయం లేకుండా ఆన్‌లైన్ రాండమైజ్డ్ డిజిటల్ సెలక్షన్ (ORDS) ప్రక్రియ ద్వారా ఎంపిక చేయడం జరిగింది.  ఎంపిక ప్రక్రియ ముగిసిన వెంటనే పారదర్శక విధానంలో ఆమోదించిన, వెయిట్‌లిస్ట్ చేసిన దరఖాస్తుదారుల జాబితాను అధికారిక పోర్టల్‌లో మొదటిసారి పొందుపరిచారు. ఎంపిక చేసిన 1.4 లక్షల మంది యాత్రికులు హజ్ 2023 కి ఎంపికైనట్లు తెలియజేస్తూ సంక్షిప్త సందేశాలు పంపారు. . వెయిట్‌లిస్ట్ చేసిన యాత్రికులకు వారి వెయిట్‌లిస్ట్ స్థితి, వెయిట్‌లిస్ట్‌లో స్థానం గురించి తెలియజేస్తూ సంక్షిప్త సందేశాలు వెళ్లాయి. 

యాత్రికులకు అవసరమయ్యే విదేశీ మారక ద్రవ్యం  అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో కలిసి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతంలో  ప్రతి యాత్రికుని  వాస్తవ అవసరాలతో సంబంధం లేకుండా భారత హజ్ కమిటీ 2100 రియాల్స్ అందుబాటులో ఉంచేది. 2023 హజ్ నిబంధనల ప్రకారం  యాత్రికులు  స్వయంగా  విదేశీ కరెన్సీని ఏర్పాటు చేసుకోవడానికి లేదా తక్కువ విదేశీ మారకద్రవ్యాన్ని తీసుకునే అవకాశాన్ని మరియు సౌలభ్యాన్ని అందిస్తుంది.  వ్యక్తిగత అవసరాలు దృష్టిలో ఉంచుకుని  యాత్రికులకు అత్యంత పోటీ ధరలకు ఫారెక్స్ సరఫరాను అందించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. 

దేశంలో 22,000 కు పైగా శాఖలు కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాత్రీకులు సౌదీ అరేబియాలో ఉండడానికి అవసరమైన నగదు సమకూర్చడంతో పాటు భీమా అవసరాలు తీరుస్తుంది. దీనికి సంబంధి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాత్రికులకు సందేశాలు పంపుతుంది. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా FOREX కార్డ్ సౌకర్యం కూడా యాత్రికులందరికీ అందిస్తుంది.దీనివల్ల  దొంగతనం లేదా భౌతిక కరెన్సీని కోల్పోయే అవకాశం ఉండదు. తీర్థయాత్ర సమయంలో ఈ కార్డు పోయినట్లయితే, యాత్రికుడు తన సొమ్మును  బ్యాంకు నుండి తిరిగి పొందవచ్చు. 

యాత్రీకులు బయలుదేరి వెళ్లే అన్ని ప్రాంతాల వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా   స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తుంది. దీనిలో నోడల్ ఆఫీసర్‌  యాత్రికులకు నగదు రూపంలో లేదా ఫారెక్స్ కార్డు ద్వారా విదేశి మారక ద్రవ్యం పొందడానికి తగిన సహకారం అందిస్తారు. యాత్రీకుల కోసం  ఒక హెల్ప్‌లైన్ నిర్వహించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.ఈ నోడల్ అధికారుల సంప్రదింపు వివరాలు త్వరలో ప్రకటిస్తారు. 

 

***


(Release ID: 1913564) Visitor Counter : 153