ప్రధాన మంత్రి కార్యాలయం

అరుణాచల్‌ ప్రదేశ్‌లో జల్‌జీవన్‌ మిషన్ అమలు 75 శాతం దాటడంపై ప్రధాని అభినందనలు

Posted On: 02 APR 2023 9:15AM by PIB Hyderabad

   రుణాచల్‌ ప్రదేశ్‌లో జల్‌జీవన్‌ మిషన్‌ అమలులో భాగంగా 75 శాతానికిపైగా ప్రజలకు.. అంటే- 1.73 గ్రామీణ కుటుంబాలకు తాగునీరు సరఫరా కావడపై రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పెమాఖండూ ట్వీట్‌పై స్పందిస్తూ పంపిన సందేశంలో:

    “అమృత మహోత్సవాల సమయంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 75 శాతానికిపైగా కుటుంబాలకు తాగునీటి సరఫరా కల సాకారం కావడం అభినందనీయం. అందునా దుర్గమ ప్రాంతాలు అధికంగాగల రాష్ట్రంలో ఈ విజయం సాధించిన అరుణాచల్‌ జట్టును ప్రశంసిస్తూ, మిగిలిన 25 శాతం లక్ష్యాన్ని సత్వరం పూర్తిచేయగలదని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.


****

DS/ST(Release ID: 1913155) Visitor Counter : 185