ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
30 MAR 2023 9:43AM by PIB Hyderabad
రాజస్థాన్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సుసంపన్న వారసత్వంగల ఆ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“రాజస్థాన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని సోదర-సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. ఈ నేపథ్యంలో సుసంపన్న, ఉజ్వల వారసత్వంగల ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1912218)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam