ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నీటి లో, భూమి మీద మరియు ఆకాశం లో మహిళలు నెలకొల్పుతున్న కొత్త రికార్డులు అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని నిర్మించడం లో మైలురాళ్ళు గా రుజువవుతాయి: ప్రధాన మంత్రి

Posted On: 16 MAR 2023 2:50PM by PIB Hyderabad

నేల మీద, నీటి లో మరియు ఆకాశం లో మహిళలు నెలకొల్పుతున్న కొత్త రికార్డులు అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని నిర్మించడం లో మైలురాళ్ళు గా రుజువు అవుతాయి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

నౌకాశ్రయాలు, నౌకాయానం మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇచ్చారు. ప్రజల ను వారు వెళ్ళదలచుకొన్న ప్రదేశాని కి చేర్చే ఒక బల్లకట్టు ను నడిపే బాధ్యత ను సరంగు సంధ్య గారు తీసుకొన్నారు అని నౌకాశ్రయాలు, నౌకాయానం మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ట్వీట్ లో తెలియ జేసింది.

 

పైన ప్రస్తావించిన కార్యసాధన లను గురించి ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నారీ శక్తి కి నమస్సులు. నీటి లో, నేల పైన మరియు నింగి లో మహిళలు ప్రతి నిత్యం నెలకొల్పుతున్నటువంటి కీర్తి ప్రమాణాలు వికసిత భారత్ (అభివృద్ధి చెందుతున్న భారతదేశం) యొక్క నిర్మాణం లో మైలురాళ్లు గా రుజువు అవుతాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST

 


(Release ID: 1907610)