ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కార్యాలయాల్లో సైతం యోగాను ఆచరించడమే మంచి ఆరోగ్యానికి చక్కని మార్గం : ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 MAR 2023 8:43PM by PIB Hyderabad

నేటి వేగవంతమైన పని షెడ్యూల్స్, కూచున్న చోటు నుంచి కదలని జీవన శైలి నేపథ్యంలో కార్యాలయాల్లో కూడా విరామసమయంలో యోగా ఆచరించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్నారు.

కార్పొరేట్  కార్యాలయాలు, నిరంతరం శ్రమించి పని చేసే వారు యోగా చేయడాన్ని ప్రోత్సహిస్తూ ‘‘వై-బ్రేక్’’ పేరిట ఆయుష్  శాఖ మంత్రి శ్రీ శర్బానంద సోనోవాల్  ఒక నిముషం నిడివి గల వీడియో విడుదల చేయడంపై స్పందిస్తూ ‘‘వేగవంతమైన పని పరిస్థితులు, కూచున్న చోటు నుంచి కదలని జీవన శైలులు ప్రత్యేక సవాళ్లను మన ముందుకు తెస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండడానికి ఏకైక మార్గం యోగా ఆచరించడమే’’ అని ప్రధానమంత్రి ట్వీట్  చేశారు.

*****

DS/TS


(రిలీజ్ ఐడి: 1907454) సందర్శకుల సూచీ సంఖ్య : : 224