ప్రధాన మంత్రి కార్యాలయం

ఆస్ట్రేలియా వ్యాపారం మరియు పర్యటన మంత్రి శ్రీ డాన్ పేరెల్ వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని గురించి ఒక ట్వీట్ లో ప్రస్తావించిన ప్రధాన మంత్రి

Posted On: 12 MAR 2023 3:10PM by PIB Hyderabad

భారతదేశాని కి మరియు ఆస్ట్రేలియా కు మధ్య గల సమృద్ధమైనటువంటి సాంస్కృతిక సంబంధాన్ని గురించి ఓ చిన్న కథ తాలూకు వివరణ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొన్ని ట్వీట్ లలో తెలియ జేశారు. ఈ విషయాన్ని భారతదేశం సందర్శన నిమిత్తం విచ్చేసిన ఆస్ట్రేలియా ప్రధాని గౌరవార్థం ఏర్పాటైన మధ్యాహ్న భోజన కార్యక్రమం లో ఏర్పాటవగా ఆస్ట్రేలియా వ్యాపారం మరియు పర్యటన శాఖ మంత్రి డాన్ ఫేరెల్ ఆ మధ్యాహ్న భోజన కార్యక్రమం లో తాను కూడా పాలుపంచుకొన్నప్పుడు శ్రీ నరేంద్ర మోదీ దృష్టి కి తీసుకువచ్చారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నా మిత్రుడు ప్రధాని శ్రీ @AlboMP గౌరవార్థం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమం లో పాల్గొన్న ఆస్ట్రేలియా వ్యాపారం మరియు పర్యటన శాఖ మంత్రి శ్రీ డాన్ ఫేరెల్ గారు ఆసక్తిదాయకమైనటువంటి సమాచారాన్ని వెల్లడించారు. శ్రీ డాన్ ఫేరెల్ కు ఒకటో తరగతి లో శ్రీమతి ఎబర్ట్ గారు విద్య ను బోధించారట. ఆయన జీవనం పై ఆమె ప్రగాఢ ప్రభావాన్ని ప్రసరింపచేశారట. మరి ఆయన కు విద్య చెప్పిన ఖ్యాతి శ్రీమతి ఎబర్ట్ గారిదే అని శ్రీ డాన్ ఫేరెల్ తెలియ జేశారు.

 

శ్రీమతి ఎబర్ట్ ఆమె యొక్క భర్త తో, కుమార్తె లియోనీ తో పాటు 1950 వ దశకం లో భారతదేశం లోని గోవా నుండి ఆస్ట్రేలియా లోని ఎడిలేడ్ కు వలస పోయి అక్కడి ఒక పాఠశాల లో విద్య ను బోధించడం మొదలుపెట్టారు. ఆవిడ కుమార్తె లియోనీ సౌత్ ఆస్ట్రేలియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టీచర్ కు అధ్యక్షురాలు అయ్యారు.

 

భారతదేశాని కి మరియు ఆస్ట్రేలియా కు మధ్య గల సమృద్ధమైన సాంస్కృతిక సంబంధాల ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేటటువంటి ఈ అంశాన్ని గురించి తెలుసుకోవడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఎవరైనా వారి గురువు ను గురించి మక్కువ తో చెప్పారు అంటే దానిని గురించి వినడం కూడాను అంతే ఉత్సాహకరం గా ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

 



(Release ID: 1906445) Visitor Counter : 129