సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
పూణెలోని ఎన్ఎఫ్ఎఐను సందర్శించి, ఎన్ఎఫ్‌హెచ్ఎం పురోగతిని సమీక్షించిన సమాచార, ప్రసార మంత్రి
భారతీయ చలనచిత్ర వారసత్వానికి నూతన జీవనాధారాన్ని ఇస్తున్న ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ - అనురాగ్ సింగ్ ఠాకూర్
Posted On:
12 MAR 2023 11:04AM by PIB Hyderabad
తన పూణె పర్యటనలో భాగంగా 11 మార్చి, 2023న ఎన్‌డిఎఫ్‌సి - నేషనల్ ఫిల్మ్ ఆర్చీవ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఎఐ)ను సందర్శించి నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ (జాతీయ చలనచిత్ర వారసత్వ మిషన్) కింద సాధించిన పురోగతిని కేంద్ర సమాచార & ప్రసార, యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ సమీక్షించారు.

భారతీయ చలనచిత్ర వారసత్వానికి ఎన్ఎఫ్‌హెచ్ఎం ఒక నూతన జీవనాధారాన్ని ఇస్తోందని, గతంలో అందరికీ అందుబాటులోలేని సినిమాలను అత్యుత్తమ నాణ్యతతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అందుబాటులోకి తేవడంతో పాటుగా, అదే సమయంలో రానున్న 100 సంవత్సరాలు, ఇంకా మరింత కాలానికి భారతీయ సినిమా సంరక్షణకు భరోసా కల్పిస్తామని శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు.


పూణెలోని ఎన్‌డిఎఫ్‌సి- నేషనల్ ఫిల్మ్ ఆర్చీవ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఎఐ)లో నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ (ఎన్ఎఫ్‌హెచ్ఎం) పూర్తి స్థాయిలో ముందుకు సాగుతోంది. ఎన్ఎఫ్‌హెచ్ఎంలో భాగంగా, ఎన్ఎఫ్‌డిసి- ఎన్ఎఫ్ఎఐలో మూడు ప్రధాన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి - సినిమాల డిజిటీకరణ, సినిమా రీళ్ళ పరిరక్షణ, సినిమాల పునరుద్ధరణ. చలనచిత్ర క్షేత్రంలో సినిమా పరిరక్షణ కోసం సాగుతున్న భారీ ప్రాజెక్టులు. ఇంత భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రయత్నం జరుగలేదు.
నేటి వరకూ, 1293 చలనచిత్రాలు, 1062 క్లుప్త & డాక్యుమెంటరీలను 4కె, 2కె రిజల్యూషన్‌లో డిజిటీకరించారు. అదనంగా 2500 చలనచిత్రాలు, క్లుప్త & డాక్యుమెంటరీలను డిజిటీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఉండగా, 1433 సెల్యులాయిడ్ (చలనచిత్ర సంబంధ) రీళ్ళ పరిరక్షణ పనిని పూర్తి అయింది. చలనచిత్ర పరిరక్షణలో అగ్రగామి నైపుణ్యాలు కలిగిన సంస్థ అయిన లా ఇమ్మాజిన్ రిట్రోవాటా సహకారంతో అత్యంత శ్రద్ధతో, శ్రమతో పూర్తి చేశారు.
ఎన్ఎఫ్‌డిసి- ఎన్ఎఫ్ఎఐ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన, సెల్యులాయిడ్ రీళ్ళ పరిరక్షణ పని జరుగుతున్న చలనచిత్ర పరిరక్షణ ప్రయోగశాలను శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ సందర్శించారు. రానున్న నెలల్లో మరిన్ని సినిమాల పరిరక్షణ జరుగనుండగా, కొన్ని సందర్భాల్లో అరుదైన భారతీయ సినిమాలకు సంబంధించి ఉనికిలో ఉన్న కాపీలు ఇవి అయి ఉండవచ్చు. ప్రస్తుతం 21 సినిమాల డిజిటల్ పునరుద్ధరణ జరుగుతుండగా, ఎన్ఎఫ్‌డిసి- ఎన్ఎఫ్ఎఐ ఇటీవలే పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించింది. రానున్న 3 ఏళ్ళల్లో, అనేక చలన చిత్రాలు, చిన్న సినిమాలు, డాక్యుమెంటరీలను డిజిటల్‌గా పునరుద్ధరింపబడతాయి.

***
(Release ID: 1906119)
Visitor Counter : 182