ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ రోజ్‌గార్ మేళాలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి - తెలుగు అనువాదం

Posted On: 20 FEB 2023 11:54AM by PIB Hyderabad

నమస్కారం!

 

రోజ్ గార్ మేళా కోసం దేవభూమి ఉత్తరాఖండ్ కు చెందిన యువ స్నేహితులకు నా హృదయపూర్వక అభినందనలు! రోజు నియామక పత్రాలు అందుకున్న వారికి రోజు ఒక నూతన ప్రయాణానికి నాంది. ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని, మీ కుటుంబాల జీవితాన్ని మార్చేస్తుంది. రోజు మీరు ప్రారంభిస్తున్న సేవ మీ జీవితాన్ని మార్చడంతో పాటు, మీ జీవితంలో భారీ మార్పు తీసుకురావడానికి ఒక మాధ్యమంగా నిలుస్తుంది. మీ సేవతో, రాష్ట్రం, దేశంలో అభివృద్ధి ప్రయత్నాలకు మీరు మీ ఉత్తమ సహకారాన్ని అందించాలి. మీలో చాలా మంది విద్యా రంగంలో సేవలందించబోతున్నారు. కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా, భారతదేశంలోని యువతను కొత్త శతాబ్దానికి సిద్ధం చేయాలని మేము తీర్మానించాము. తీర్మానాన్ని ఉత్తరాఖండ్లో అమలు చేయాల్సిన బాధ్యత మీలాంటి యువకుల భుజాలపై ఉంది.

 

మిత్రులారా!

 

అది కేంద్ర ప్రభుత్వం అయినా, లేదా ఉత్తరాఖండ్ బీ.జే.పీ. ప్రభుత్వం అయినా, ప్రతి యువకుడు అతని / ఆమె ఆసక్తి, సామర్థ్యానికి అనుగుణంగా కొత్త అవకాశాలను పొందాలని, ప్రతి ఒక్కరూ ముందుకు సాగడానికి సరైన మాధ్యమాన్ని పొందాలని, మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాము. ప్రభుత్వ సర్వీసుల్లో నియామకాలకు సంబంధించిన ప్రచారం కూడా దిశలో వేసిన ఒక ముందడుగు. గత కొన్ని నెలలుగా, దేశంలోని లక్షలాది మంది యువతకు కేంద్ర ప్రభుత్వం నియామక పత్రాలను అందజేసింది. దేశవ్యాప్తంగా బీ.జే.పీ. పాలిత రాష్ట్రాలతో పాటు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ, ఇటువంటి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రోజు ఉత్తరాఖండ్ కూడా ప్రచారంలో చేరడం నాకు సంతోషంగా ఉంది.

మిత్రులారా!

'కొండల్లో నీరు, యువశక్తి సాధారణంగా కొండ ప్రాంతానికి ఉపయోగించబడదు' అని చెప్పిన పాత నమ్మకాన్ని మనం మార్చుకోవాలి. అందుకే ఉత్తరాఖండ్ యువత తమ గ్రామాలకు తిరిగి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తోంది. ఇందుకోసం కొండల్లో నూతన ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోంది. రోజు అనేక రహదారులు నిర్మించడం, రైల్వే లైన్లు వేయడం మీరు చూడవచ్చు. విధంగా, ఉత్తరాఖండ్లో మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. దీంతో సుదూర గ్రామాలకు చేరుకోవడం సులభతరమవుతోంది. ఫలితంగా, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా సృష్టించబడుతున్నాయి. నిర్మాణ పనులు, ఇంజినీరింగ్పనులతో పాటు, ముడిసరుకులకు సంబంధించిన పరిశ్రమలు, లేదా దుకాణాల వంటి ప్రతిచోటా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. రవాణా రంగంలో డిమాండ్ పెరగడం వల్ల యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. గతంలో, రకమైన ఉద్యోగాల కోసం, ఉత్తరాఖండ్లోని నా గ్రామీణ యువత నగరం వైపు వెళ్ళవలసి వచ్చింది. రోజు, ప్రతి గ్రామంలో ఇంటర్నెట్, డిజిటల్ సేవలను అందించే ఉమ్మడి సేవా కేంద్రాల్లో కూడా వేలాది మంది యువత పని చేస్తున్నారు.

మిత్రులారా!

 

ఉత్తరాఖండ్లోని సుదూర ప్రాంతాలు రోడ్డు, రైలు, ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించబడుతున్నందున, పర్యాటక రంగం కూడా బాగా విస్తరిస్తోంది. పర్యాటక పటంపై కొత్త పర్యాటక ప్రదేశాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. పర్యవసానంగా, ఉత్తరాఖండ్ యువత ఇంటి దగ్గర ఇలాంటి ఉపాధి అవకాశాలను పొందుతున్నారు, దీని కోసం వారు ఇంతకు ముందు పెద్ద నగరాలకు వెళ్లవలసి వచ్చింది. పర్యాటక రంగంలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి ముద్ర యోజన ఎంతగానో సహాయపడుతోంది. పథకం కింద దుకాణాలు, దాబాలు, అతిధి గృహాలు, హోమ్స్టేలు వంటి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నవారు ఎటువంటి హామీ లేకుండా పది లక్షల రూపాయల వరకు రుణాలు పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 38 కోట్ల మంది ముద్రా రుణాలు అందుకున్నారు. రుణాల సాయంతో దాదాపు 8 కోట్ల మంది యువత తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారారు. వీరిలో మహిళలు ఎస్.సి. / ఎస్.టి. / .బి.సి తరగతులకు చెందిన యువ స్నేహితుల సంఖ్య భారీగా ఉంది. ఉత్తరాఖండ్కు చెందిన వేలాది మంది స్నేహితులు కూడా పధకాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

 

 

మిత్రులారా!

 

 

ఇది భారతదేశ యువతకు అద్భుతమైన అవకాశాల 'అమృత్ కాల్'. మీరు మీ సేవల ద్వారా దానికి స్థిరమైన ఊపు ఇవ్వాలి. మరోసారి, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఉత్తరాఖండ్ ప్రజలకు బాగా సేవ చేస్తారని, ఉత్తరాఖండ్ను మెరుగుపరచడంలో సహకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రయత్నాలతో మన దేశం కూడా బలంగా, సమర్థంగా, సుసంపన్నంగా మారుతుంది!

 

 

చాలా ధన్యవాదాలు!

 

 

గమనిక : ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి ఇది స్వేచ్చానువాదం.

 

 

*****

 


(Release ID: 1901046) Visitor Counter : 192