ప్రధాన మంత్రి కార్యాలయం
ఎయిర్ ఇండియా-ఎయిర్‌బస్ కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో వీడియో కాల్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఈ భాగస్వామ్యం కింద ఎయిర్బస్ నుంచి 250 విమానాలను ఎయిర్ ఇండియా కొనుగోలు... భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్య శక్తికి ఇది ప్రతిబింబం;
భారత దేశంలో పౌర విమానయాన మార్కెట్ సత్వర విస్తరణ-వృద్ధిని ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధాని… దీంతో భారత్-ఇతర ప్రపంచ దేశాల మధ్య సంధానానికి స్ఫూర్తి;
భారత్‌లో ఫ్రాన్స్ కంపెనీల బలమైన ఉనికిని అభినందించిన ప్రధానమంత్రి…
భారత్‌లో అతిపెద్ద ‘ఎంఆర్ఒ’ కేంద్రం ఏర్పాటుకు ఇటీవల ఫ్రాన్స్ ఏరోస్పేస్
ఇంజిన్ తయారీదారు ‘శాఫ్రాన్’ సంస్థ నిర్ణయించడాన్ని గుర్తుచేసిన ప్రధాని;
భారత్-ఫ్రాన్స్ సంబంధాల పురోగతిలో భాగస్వామ్యంపై అధ్యక్షుడు మాక్రాన్‌కు ప్రధాని
కృతజ్ఞతలు.. భారత జి20 అధ్యక్షత కింద సంయుక్తంగా పనిచేయడంపై ప్రధాని ఆసక్తి
Posted On:
14 FEB 2023 8:36PM by PIB Hyderabad
ఎయిర్ ఇండియా-ఎయిర్‌బస్ భాగస్వామ్యం ప్రారంభమైన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సామూహిక వీడియో కాల్ ద్వారా ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో సంభాషించారు. టాటా సన్స్ సంస్థ గౌరవ చైర్మన్ శ్రీ రతన్ టాటా, బోర్డు చైర్మన్ శ్రీ ఎన్.చంద్రశేఖరన్, ఎయిర్ ఇండియా సీఈవో శ్రీ క్యాంప్‌బెల్ విల్సన్, ఎయిర్‌బస్ సీఈవో శ్రీ గుయిలౌమ్ ఫౌరీ కూడా ఈ కాల్‌లో పాలుపంచుకున్నారు.
ఎయిర్ ఇండియా-ఎయిర్‌బస్ మధ్య విమానాల కొనుగోలుకు కుదిరిన కాంట్రాక్టుపై ఉభయ పక్షాలూ సంతకాలు చేశాయి. దీనికింద 250 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 210 సింగిల్-ఐల్ ‘ఎ320ఎన్‌ఇఒ’లు, 40 వైడ్‌బాడీ ‘ఎ350’ విమానాలను ఆ సంస్థ ఎయిర్ ఇండియాకు సరఫరా చేస్తుంది.
ఈ ఏడాది 25వ వార్షికోత్సవం నిర్వహించుకోనున్న భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని విమానయాన రంగంలోని రెండు దిగ్గజ సంస్థల మధ్య కుదిరిన ఈ వాణిజ్య భాగస్వామ్యం ప్రస్ఫుటం చేస్తోంది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- భారత దేశంలో పౌర విమానయాన మార్కెట్ వేగంగా విస్తరించడంతోపాటు వృద్ధి బాటలో పయనించటాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. తద్వారా భారతదేశానికి ఇతర ప్రపంచ దేశాలతో అనుసంధానం మరింత ఊపందుకోగలదని ఆయన అన్నారు. ఈ పరిణామంతో భారతదేశంలో పర్యాటకానికి, వ్యాపారాలకు ప్రోత్సాహం కూడా లభిస్తుందని పేర్కొన్నారు.
భారత్‌లో ఫ్రాన్స్ కంపెనీలు బలమైన ఉనికిని చాటుకుంటున్నాయని ప్రధానమంత్రి అభినందించారు. భారత్‌లో అతిపెద్ద నిర్వహణ-మరమ్మతు-ఓవరాల్’ (ఎంఆర్ఒ) కేంద్రం ఏర్పాటుకు ఇటీవల ఫ్రాన్స్ ఏరోస్పేస్ ఇంజిన్ తయారీదారు ‘శాఫ్రాన్’ సంస్థ నిర్ణయించడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ కేంద్రంలో భారత, అంతర్జాతీయ విమానయాన సంస్థల విమాన ఇంజన్ల సర్వీసింగ్ సేవలు లభిస్తాయని తెలిపారు.
భారత్-ఫ్రాన్స్ సంబంధాల పురోగతిలో అధ్యక్షుడు మాక్రాన్ భాగస్వామ్యంపై ప్రధానమంత్రి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. భారత జి20 అధ్యక్షత కింద ఆయనతో కలసి పనిచేసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నానని చెప్పారు.
***
(Release ID: 1899261)
Visitor Counter : 187
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam