ప్రధాన మంత్రి కార్యాలయం
రెండు రోజుల్లో 10 లక్షలకుపైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభించడంపై ఇండియా పోస్ట్‌కు ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
11 FEB 2023 9:36PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో 10 లక్షలకుపైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభించిన ఇండియా పోస్ట్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. దీంతో బాలికల భవిష్యత్తుకు భద్రతసహా వారికి సాధికారత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
దీనిపై కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ట్వీట్‌కు ప్రతిస్పందనగా చేసిన ట్వీట్‌లో:
“ఇదెంతో ఘన విజయం… ఇందుకు @IndiaPostOfficeను అభినందిస్తున్నాను. ఈ కృషి దేశమాత పుత్రికల భవిష్యత్తును మరింత సురక్షితం చేయడంతోపాటు ఉజ్వలంగా మారుస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1898512)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam