ఆర్థిక మంత్రిత్వ శాఖ
33% నుంచి 10 లక్షల కోట్లకు పెరిగిన మూలధన పెట్టుబడి వ్యయం
కేంద్ర సమర్ధవంతమైన మూలధన వ్యయం జిడిపిలో 4.5%
రాష్ట్రాలకు మరొక ఏడాది కొనసాగనున్న 50 ఏళ్ళ వడ్డీ రహిత రుణం
ప్రైవేటు పెట్టుబడుల కోసం వాటాదారులకు తోడ్పడనున్న మౌలిక సదుపాయాల ఆర్థిక సెక్రటేరియేట్
Posted On:
01 FEB 2023 1:01PM by PIB Hyderabad
ఇటీవలి సంవత్సరాల సరళులను కొనసాగిస్తూ, ఉపాధి, వృద్ధికి చోదకంగా మూలధన పెట్టుబడిని భావిస్తూ కేంద్ర బడ్జెట్ 2023-24 మూలధన పెట్టుబడి వ్యయాన్ని పెంపును ప్రతిపాదిస్తోంది. ఈ విషయాన్ని బుధవారం పార్లమెంటులో బడ్జెట్ 2023-24ను ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్దిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన పెరుగుదల అన్నది వృద్ధి సంభావ్యతను పెంపొందించేందుకు, ఉపాధి కల్పనకు ప్రైవేటు పెట్టుబడులను పోగుచేసి, అంతర్జాతీయంగా వీస్తున్న ప్రతిగాలులకు వ్యతిరేకంగా పరిపుష్టిని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు గణనీయమైనవని శ్రీమతి సీతారామన్ అన్నారు.
వరుసగా మూడవ సంవత్సరం కూడా మూలధన పెట్టుబడి వ్యయాన్ని 33% నుంచి 10 లక్షల కోట్లకు పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఇది 2019-20లో చేసిన వ్యయం కంటే మూడు రెట్లు ఎక్కువ కావడమే కాదు, జిడిపిలో 3.3% అవుతుంది.
సమర్ధవంతమైన మూలధన వ్యయం
రాష్ట్రాలకు గ్రాంట్స్-ఇన్-ఎయిడ్ (ధన సహాయం)ను అందించడం ద్వారా మూలధన ఆస్తులను సృష్టించే నిబంధనతో కేంద్రం ప్రత్యక్ష మూలధన పెట్టుబడి పెడుతూ పూరకంగా వ్యవహరిస్తోందని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర సమర్ధవంతమైన మూలధన వ్యయం బడ్జెట్ రూ. 13.7 లక్షల కోట్లు, అంటే జీడిపిలో 4.5%గా ఉంటుందని ఆమె తెలిపారు.
రాష్ట్రాలకు వడ్డీరహిత రుణాల కొనసాగింపు
మౌలిక సదుపాయలలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, పరిపూరకమైన విధాన చర్యల చేపట్టే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు 50-ఏళ్ళ వడ్డీ రహిత రుణాలను మరొక ఏడాది ఇవ్వాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈ విషయమై వ్యయాన్ని చెప్పుకోదగిన స్థాయిలో రూ. 1.3 లక్షల కోట్లు పెంచనున్నారు.
మౌలిక సదుపాయాల ఆర్థిక సెక్రటేరియేట్
మహమ్మారి అణగిపోయిన కాలం తర్వాత ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతున్నాయి ఆర్థిక మంత్రి తన బడ్జెట్ 2023-24 ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రభుత్వరంగ వనరులపై ఎక్కువగా ఆధారపడిన రంగాలలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల ఆర్థిక సెక్రటేరియట్ రైల్వేలు, రహదారులు, పట్టణ మౌలిక సదుపాయాలు, విద్యుత్ సహా పలు మౌలిక సదుపాయాల రంగాలలో మరిన్ని ప్రైవేటు పెట్టుబడులను వాటాదారులందరికీ తోడ్పడుతుంది.
***
(Release ID: 1895594)
Visitor Counter : 262