ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఎవరినీ వెనుకబడనీయరాదన్న మంత్రం 2014నుంచి సమ్మిళిత అభివృద్ధికి దోహదపడిరది. తలసరి రాబడిలో రెట్టింపు వృద్ధి
భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలోనే ఇప్పుఉడు అయిదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ
ఇపిఎఫ్‌ఒ సభ్యుల సంఖ్య రెట్టింపునకు మించి పెరిగి 27 కోట్లకు చేరిక
2022లో యుపిఐ ఇన్ ద్వారా 7,400 కోట్ల డిజిటల్ లావాదేవీల ద్వారా 126 లక్షల కోట్ల రూపాయల చెల్లింపు
Posted On:
01 FEB 2023 1:33PM by PIB Hyderabad
2014 నుంచి దేశం సాధించిన ప్రగతి గురించి కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2023`24 కేంద్ర బడ్జెట్ సమర్పణ సందర్భంగా ప్రస్తావించారు. ఎవరినీ వెనుకపట్టు పట్టనివ్వరాదన్న మంత్రం ఫలితంగా దేశంలో సమ్మిళిత అభివృద్ధిసాధ్యమైందని అన్నారు. ఇది ప్రజలందరికీ మెరుగైన నాణ్యమైన జీవనానికి, గౌరవప్రదమైన జీవితానికి వీలు కల్పించిందని ఆమె అన్నారు.
2014 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం సాధించిన ఎన్నో విజయాలను ప్రస్తావిస్తూ ఆమె, తలసరి ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువ అయి 1.97 లక్షలకు చేరిందని అన్నారు.
దీనికితోడు గత 9 సంవత్సరాలలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 10 వ స్థానం నుంచి 5 వ పెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి ఎదిగింది. ‘‘మనం చెప్పుకోదగిన స్థాయిలో మన స్థానాన్ని మంచి పాలనతో, వినూత్నతతో మెరుగుపరుచుకో గలిగాం. వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని కల్పించగలిగాం.పలు అంతర్జాతీయ సూచికలు దీనిని సూచిస్తున్నాయి. పలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో చెప్పుకోదగిన పురోగతిని సాధించాం’’ అని ఆమె పేర్కొన్నారు.
ఆర్థిక వ్యవస్థ కుదుటపడిరదని, ఇదిఇపిఎఫ్ సభ్యుల సంఖ్య రెట్టింపుకంటేఎక్కువ పెరిగి 27 కోట్లకు చేరిన విషయం స్పష్టం చేస్తున్నదని చెప్పారు. దీనికితోడు 7,400 కోట్ల డిజిటల్ లావాదేవీల ద్వారా 126 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులు యుపిఐ ద్వారా జరిగాయని ఆమె అన్నారు.
పలు పథకాలు సమర్థంగా అమలు చేయడం, లక్షిత ప్రయోజనాలను సార్వత్రీకరించడం ద్వారా 2014 నుంచి సమ్మిళిత అభివృద్ధి సాధ్యమైనట్టు కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు.

ప్రభుత్వం సాధించిన కొన్ని ప్రముఖ విజయాలలో కొన్ని......
1. స్వచ్ఛభారత్ మిషన్ కింద 11.7 కోట్ల ఇళ్లకు టాయిలెట్లు సమకూర్చడం
2.ఉజ్వల పథకం కింద 9.6 కోట్ల ఎల్.పి.జి కనెక్షన్లు
3.102 కోట్ల మంది ప్రజలకు 220 కోట్ల కోవిడ్ వాక్సినేషన్
4.పి.ఎం.జన్‌ధన్ బ్యాంక్ ఖాతాలలో 47.8 కోట్లరూపాయల జమ
5.పిఎం సురక్ష బీమా యోజన, పిఎం జీవన్ జ్యోతియోజన పథకం కింద 44.6 కోట్లమందికి ఇన్సూరెన్సు సదుపాయం. 6.పి.ఎం. కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11.4 కోట్ల మంది రైతుల ఖాతాలకు 2.2 లక్షల కోట్ల రూపాయల బదిలీ
***
(Release ID: 1895517)