ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్ సమయంలో సంక్షభ నిర్వహణలో ఎస్‌హెచ్‌జిల సహకారాన్ని పట్టిచూపిన ఆర్ధిక సర్వే 2022-23
మారుమూల గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు మాస్కులను అందుబాటులోకి తెచ్చి, ఉపయోగించేందుకు దోహదం చేసేవిధంగా ఎస్‌హెచ్‌జిల మాస్కుల ఉత్పత్తి
సుదీర్ఘకాల గ్రామీణ పరివర్తనకు ఎస్‌హెచ్‌జిలు సంక్షభ కాలంలో అవసరాలను తీర్చడంలో చూపిన బలాన్ని, సరళత్వాన్ని క్రమబద్ధీకరించాలని సూచించిన సర్వే
Posted On:
31 JAN 2023 1:25PM by PIB Hyderabad
స్వయం సహాయక బృందం (ఎస్‌హెచ్‌జి) మహిళలను సమీకృతం, ఐక్యం చేసి, తమ బృంద గుర్తింపును అధిగమించి సామూహికంగా విపత్తు నిర్వహణకు దోహదం చేసేందుకు మహమ్మారి కాలం ఒక అవకాశంగా పని చేసింది. వారు విపత్తు నిర్వహణలో కీలకమైన వాటాదారులుగా అవతరించి, మాస్కులను ఉత్పత్తి చేయడం (అస్సాంలో గముసా మాస్కుల వంటి సాంస్కృతిక వైరుధ్యాలను కలిగిన మాస్కులు), శానిటైజర్లు, రక్షణ సామాగ్రి, దుస్తులు, మహమ్మారి గురించి అవగాహన కల్పించడం (ఉదాహరణకు, ఝార్ఖండ్‌కు చెందిన పత్రకార్ దీదీలు), నిత్యావసర సామాగ్రిని సరఫరా చేయడం (ఉదా. కేరళలలో ఫ్లోటింగ్ సూపర్‌మార్కెట్ల ఏర్పాటు), సామూహిక వంటగదులు (ఉదా. ఉత్తరప్రదేశ్‌లో ప్రేరణ క్యాంటీన్లు), వ్యవసాయ జీవనోపాధులకు తోడ్పాటు (ఉదా. జంతు ఆరోగ్య సంరక్షణ సేవలకు పశు సఖీస్ , ఝార్ఖండ్‌లో కాయగూరుల అమ్మకాలకు ఆజీవికా ఫార్మ్ ఫ్రెష్ ఆన్‌లైన్ అమ్మకాలు & పంపిణీ యంత్రాంగం), ఎంజిఎన్ఆర్ఇజిఎస్ తో కలవడం (యుపి, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లలో), ఆర్ధిక సేవల బట్వాడా (ఉదా. కోవిడ్ ఉపశమన డిబిటి నగదు బదిలీను పొందేందుకు బ్యాంకుల వద్ద రద్దీని నిర్వహించేందుకు బ్యాంక్ సఖీస్) కీలకంగా దోహద పడినట్టు మంగళవారం కేంద్ర ఆర్ధిక & కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే 2022-23 పేర్కొంది. కోవిడ్-19 వైరస్ నుంచి పరిరక్షణకు కీలకమైన మాస్కులను మారుమూల గ్రామీణ ప్రాంతాలలో వారుకి కూడా ఉపయోగించేందుకు అందుబాటులో ఉంచడం, వాటిని ఎస్‌హెచ్‌జిలు ఉత్పత్తి చేయడం చెప్పుకోదగిన తోడ్పాటని సర్వే పేర్కొంది. డిఎవై- ఎన్ఆర్ఎల్ఎం కింద ఎస్‌హెచ్‌జిలు 4 జనవరి 2023 నాటికి 16.9 కోట్ల మాస్కులను ఉత్పత్తి చేశాయి.
ఎస్‌హెచ్‌జిలకు ప్రభుత్వం కోవిడ్-19 ప్యాకేజీలు
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన (పిఎంజికెవై) కింద మహిళా ఎస్‌హెచ్‌జిలకు అనుషంగిక షరతులు లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడం జరిగింది. ఇది 63 లక్షల మహిళా ఎస్‌హెచ్‌జిలకు, 6.85 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుందని అంచనా.
కోవిడ్ పీడిస్తున్న ప్రాంతాలు, బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో గ్రామీణ సంస్థలు (విఒలకు) రూ. 1,5 లక్షల అదనపు వల్నరబలిటీ రిడక్షన్ ఫండ్ (భేద్యతను తగ్గించే నిధి)ని జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) అనుమతించింది.
ముందుకు మార్గం
మొత్తం గ్రామీణాభివృద్ధిని సులభతరం చేసేందుకు తగిన ప్రాంతాలలో ఎస్‌హెచ్‌జిలు ఉన్నాయి. చివరి మైలు వరకు వారి అందుబాటు, సమాజ విశ్వాసాన్ని చూరగొనగల వారి సామర్ధ్యం, సంఘీభావం, స్థానిక గతిశీలత గురించిన అవగాహన, సులభమైన ఉత్పత్తులను వేగంగా ఉత్పత్తి చేయగల సామర్ధ్యం, సభ్యుల ఆర్ధిక కార్యకలాపాలను కలుపుకోవడం ద్వారా సేవలను అందించడం కారణంగా వారు కీలకంగా మారారు. కోవిడ్ సహా సంక్షభ సమయంలో వారి శక్తిని, వారి సరళత్వాన్ని సుదీర్ఘకాలంలో గ్రామీణ పరివర్తనకు క్రమబద్ధీకరించడం అవసరమని బడ్జెట్ ముందస్తు సర్వే సూచించింది. ఇందులో, ఇతర విషయాలతో సహా ఎస్‌హెచ్‌జి ఉద్యమాన్ని మరింత లోతుగా తీసుకువెళ్ళేందుకు అంతర్ ప్రాంతీయ వ్యత్యాసాలను పరిష్కరించడం, ఎస్‌హెచ్‌జి సభ్యులను సూక్ష్మ వ్యవస్థాపకులకుగా మార్చడం, ఉత్పత్తులు, సేవల విలువ లంకెలో పైకి కదిలేందుకు సాంస్కృతికంగా సందర్భోచితమైన నైపుణ్యాల అభివృద్ధి , ఎస్‌హెచ్‌జి గొడుకు కిందకు అతితక్కువ ప్రాధాన్యత కలిగిన వర్గాలను చేర్చడం ఉన్నాయి.
***
(Release ID: 1895107)
Visitor Counter : 312