ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ యొక్క 77 వ సమావేశం అధ్యక్షుడు శ్రీ చాబా కోరొశిసమావేశమయ్యారు


జల వనరులనిర్వహణ- సంరక్షణ రంగాల యొక్క సముదాయాలు సహా అన్నిసముదాయాల కోసం భారతదేశం అమలుపరుస్తున్నటువంటి పరివర్తనపూర్వక కార్యక్రమాల ను ప్రశంసించిన కోరొశి

ప్రపంచ సంస్థ లలో సంస్కరణల ను తీసుకు వచ్చే ప్రయాసల లో భారతదేశం అగ్రేసర భూమిక నునిర్వర్తించడానికి గల ప్రాధాన్యాన్ని గురించి వివరించిన శ్రీ చాబా కోరొశి

ప్రపంచసమస్యల ను పరిష్కరించడం కోసం ఐక్య రాజ్య సమితిసాధారణ సభ యొక్క విజ్ఞ‌ానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞ‌ానం లపై ఆధారపడ్డ ఆలోచన లసరళి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

సమకాలీనభౌగోళిక- రాజకీయ వాస్తవాల ను చక్క గా  ప్రతిబింబించే విధం గా ఐ రా స భద్రత మండలి సహా బహుపక్షీయ వ్యవస్థ లో సంస్కరణల కు ప్రాధాన్యాన్నిఇవ్వాలని స్పష్టం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 30 JAN 2023 8:00PM by PIB Hyderabad

క్య రాజ్య సమితి సాధారణ సభ యొక్క 77 వ సమావేశం అధ్యక్షుడు (పిజిఎ) శ్రీ చాబా కోరొశి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు.

సమావేశం కొనసాగిన క్రమం లో, జల వనరుల నిర్వహణ మరియు సంరక్షణ రంగాల యొక్క సముదాయాలు సహా అన్ని సముదాయాల కోసం భారతదేశం అనుసరించినటువంటి పరివర్తనశీల కార్యక్రమాల ను శ్రీ చాబా కోరొశి ప్రశంసించారు. సంస్కరణలతో కూడిన బహుపక్షవాదం పట్ల భారతదేశం చేస్తున్నటువంటి కృషి ని ఆయన కొనియాడారు. ప్రపంచ వ్యవస్థ ల లో సంస్కరణ లను తీసుకురావాలన్న ప్రయాసల లో భారతదేశం అగ్రేసర భూమిక ను పోషించడానికి గల ప్రాముఖ్యాన్ని గురించి ఆయన నొక్కిచెప్పారు.

శ్రీ చాబా కోరొశి పదవీ బాధ్యతల ను స్వీకరించిన తరువాత ఒకటో సారి భారతదేశాని కి ద్వైపాక్షిక పర్యటన కు తరలివచ్చినందుకు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను తెలియ జేశారు. ప్రపంచ సమస్యల ను పరిష్కరించడం కోసం ఐక్య రాజ్య సమితి సాధారణ సభ యొక్క విజ్ఞ‌ానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞ‌ానం ఆధారిత ఆలోచనల సరళి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. శ్రీ చాబా కోరొశి అధ్యక్ష పదవీ కాలం లో, యుఎన్ 2023 వాటర్ కాన్ఫరెన్స్ సహా ఐక్య రాజ్య సమితి సాధారణ సభ యొక్క 77వ సమావేశాల సందర్భాల లో భారతదేశం పూర్తి సమర్థన ను అందిస్తుంది అని ప్రధాన మంత్రి అంటూ ఆయన కు హామీ ని ఇచ్చారు.

సమకాలీన భౌగోళిక- రాజకీయ వాస్తవాల ను ప్రతిబింబించేటట్లు గా ఐక్య రాజ్య సమితి భద్రత మండలి సహా బహుపక్షీయ వ్యవస్థ లో సంస్కరణల కు చోటు ఇవ్వడానికి ఉన్న ప్రాధాన్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

 

***



(Release ID: 1894839) Visitor Counter : 229