ప్రధాన మంత్రి కార్యాలయం
జల్ జీవన్ మిషన్ కింద కొళాయి కనెక్షన్లు 11 కోట్లకు చేరడంపై ప్రధాని ప్రశంసలు
Posted On:
25 JAN 2023 11:51AM by PIB Hyderabad
జల్ జీవన్ మిషన్ కింద కొళాయి కనెక్షన్లు 11 కోట్లకు చేరడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిపొందిన వారందరినీ శ్రీ మోదీ అభినందించారు. అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నవారికీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఇచ్చిన సందేశంలో:
“ఇంటింటికీ నీరు’ కింద భారత ప్రజలకు కొళాయి కనెక్షన్లు ఇవ్వడంలో ఇది అద్వితీయ విజయం. ఈ కార్యక్రమంద్వారా ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరికీ, అదే సమయంలో దీన్ని విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నవారందరికీ నా అభినందనలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1893612)
Visitor Counter : 159
Read this release in:
Urdu
,
Assamese
,
English
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam