ప్రధాన మంత్రి కార్యాలయం

మణిపూర్ ప్రజలకు ప్రధాని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

Posted On: 21 JAN 2023 10:01AM by PIB Hyderabad

    ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మణిపూర్‌ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“మణిపూర్ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. కొన్నేళ్లుగా రాష్ట్రం అనేక అంశాలలో ప్రగతి పథంలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలన్నీ సత్వరం నెరవేరాలని, భారత ప్రగతి పయనాన్ని బలోపేతం చేయడంలో మణిపూర్‌ తనవంతు కృషిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SH



(Release ID: 1892680) Visitor Counter : 153