ప్రధాన మంత్రి కార్యాలయం
రోజ్ గార్ మేళా లో భాగం గా, ప్రభుత్వ విభాగాలు మరియు సంస్థల లో కొత్త గా భర్తీ చేసుకొన్న వ్యక్తుల కు దాదాపు గా 71,000 నియామక లేఖల ను జనవరి 20వ తేదీ నాడు ఇవ్వనున్న ప్రధాన మంత్రి
Posted On:
19 JAN 2023 2:42PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 20వ తేదీ న ఉదయం 10:30 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా దాదాపు గా 71,000 నియామక లేఖల ను ప్రభుత్వ విభాగాలు మరియు సంస్థల లో కొత్త గా భర్తీ అయిన వ్యక్తుల కు పంపిణీ చేయనున్నారు. ఈ విధం గా నియామకం జరిగిన వారిని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.
ఉపాధి కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలన్న ప్రధాన మంత్రి వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో వేసిన ఒక అడుగు గా రోజ్ గార్ మేళా ఉంది. ఉపాధి కల్పన ను పెంపొందింప చేయడం లో ఒక ఉత్ప్రేరకం గా ఈ రోజ్ గార్ మేళా పని చేయగలదన్న ఆశ ఉంది. అంతేకాక యువత కు ఉపాధి కల్పన అవకాశాల ను మరియు దేశ నిర్మాణం లో ప్రాతినిధ్యం ల తాలూకు అవకాశాల ను ఈ మేళా అందించనుంది.
దేశం లోని వివిధ ప్రాంతాల నుండి ఎంపిక అయిన వారు భారత ప్రభుత్వం లో జూనియర్ ఇంజినీర్స్ , లోకో పైలట్స్ , టెక్నీషియన్స్, ఇన్ స్పెక్టర్ సబ్ ఇన్ స్పెక్టర్స్, కానిస్టేబుల్ , స్టెనోగ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, గ్రామీణ్ డాక్ సేవక్, ఇన్ కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్, టీచర్, నర్స్, డాక్టర్, సోశల్ సెక్యూరిటి ఆఫీసర్, పిఎ, ఎంటిఎస్ మొదలైన వేరు వేరు పదవుల లో/ఉద్యోగాల లో చేరనున్నారు.
ఉద్యోగాల లోకి ఈ మధ్యే చేర్చుకొన్న అధికారులు కర్మయోగి ప్రారంభ్ మాడ్యూల్ నుండి ఏయే విషయాల ను నేర్చుకొన్నారో కూడా ఈ రోజ్ గార్ కార్యక్రమం లో వెల్లడించే ఆస్కారం ఉన్నది. వివిధ ప్రభుత్వ విభాగాల లో కొత్త గా నియామకం జరిగిన వారి కి ఆన్ లైన్ మాధ్యం ద్వారా ఓరియంటేశన్ కోర్సు ను బోధించేందుకు రూపొందించిందే కర్మయోగి ప్రారంభ్ మాడ్యూల్.
***
(Release ID: 1892230)
Visitor Counter : 250
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam