ప్రధాన మంత్రి కార్యాలయం

సికిందరాబాద్ నుండి  విశాఖపట్నం కువెళ్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు జనవరి 15 వ తేదీ న పచ్చ జెండా ను  చూపనున్న ప్రధానమంత్రి

Posted On: 13 JAN 2023 4:56PM by PIB Hyderabad

సికిందరాబాద్ నుండి విశాఖపట్నం కు వెళ్ళే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 15వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా పచ్చజెండా ను చూపెట్టి ఆ రైలు ను ప్రారంభించనున్నారు.

 

భారతీయ రైల్ ప్రవేశపెడుతున్న ఎనిమిదో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇది. ఈ రైలు దాదాపు గా 700 కిలో మీటర్ ల దూరాన్ని అధిగమించి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లను కలుపుతూ ప్రయాణించేటటువంటి మొట్టమొదటి రైలు కానున్నది. ఈ రైలు తెలంగాణ లోని సికిందరాబాద్ నుండి బయలుదేరి వరంగల్, ఖమ్మం రైల్ వే స్టేశన్ లతో పాటుగా ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ, రాజమండ్రి మరియు విశాఖపట్నం స్టేశన్ లలో ఆగుతుంది.

దేశీయం గా రూపొందించినటువంటి ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు లో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాల ను జతపరచడమైంది. మరి ఇది రైలు వినియోగదారుల కు వేగవంతమైన, సౌకర్యాలతో కూడిన మరియు అనుకూలమైన ప్రయాణానుభూతి ని అందించగలదు.

 

***



(Release ID: 1891039) Visitor Counter : 164